
Updated : 18 Oct 2021 10:07 IST
Surprise Gift: కాబోయే భార్యకు భారీ సర్‌ప్రైజ్ గిఫ్ట్
బీజింగ్: కాబోయే భార్యకు ఓ వరుడు ఇచ్చిన భారీ కానుకను చూసి ఆ వధువుతో పాటు బంధువులూ ఆశ్చర్యపోయారు. బంగారం లాంటి భర్త తనకు దొరికాడని ఆమె మురిసిపోగా.. నీ ప్రేమ బంగారంగానూ అంటూ బంధువులు దీవించారు. చైనాలోని హుబే రాష్ట్రంలో సెప్టెంబర్ 30న ఓ వివాహ వేడుక జరిగింది. అక్కడకు వెళ్లిన అతిథులు వధువును చూసి ఆశ్చర్యపోయారు. ఆ వధువు 60 కిలోల బంగారు ఆభరణాలతో అలంకరించుకోవడం అందుకు కారణం! ఆ నగలను వరుడు కానుకగా ఇచ్చాడు. 60 బంగారు నెక్లెస్‌లు(ఒక్కోటి కిలో బరువు), నాలుగు భారీ బంగారు గాజులు బహుమతిగా ఇచ్చాడు. అంతటి బరువున్న ఆభరణాలు ధరించిన వధువు అసలు నడవలేకపోయింది. అది గమనించిన వరుడు ఆమెకు సహాయం చేశాడు.
Tags :