Covishield: ఆమోదిత సూత్రీకరణల జాబితాలో కొవిషీల్డ్‌

ఆస్ట్రాజెనెకా కొవిషీల్డ్‌ను బ్రిటన్‌ అంతర్జాతీయ పర్యాటక అడ్వైజరీ ఆమోదిత సూత్రీకరణల జాబితాలో చేర్చుతున్నట్లుగా బ్రిటన్‌ బుధవారం ప్రకటించింది. ఈ మేరకు సవరణ అడ్వైజరీ జారీచేసింది.

Updated : 23 Sep 2021 07:13 IST

బ్రిటన్‌ ప్రకటన

లండన్‌: ఆస్ట్రాజెనెకా కొవిషీల్డ్‌ను బ్రిటన్‌ అంతర్జాతీయ పర్యాటక అడ్వైజరీ ఆమోదిత సూత్రీకరణల జాబితాలో చేర్చుతున్నట్లుగా బ్రిటన్‌ బుధవారం ప్రకటించింది. ఈ మేరకు సవరణ అడ్వైజరీ జారీచేసింది. ఆమోదించిన టీకాలకు సంబంధించి 17 దేశాలతో రూపొందించిన జాబితాలో మాత్రం భారత్‌ను ఇప్పటికీ చేర్చలేదు. అందువల్ల భారతీయులు టీకాలు తీసుకోని ప్రయాణికుల కోసం రూపొందించిన నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉంటుంది. అక్టోబరు 4వ తేదీ నుంచి విదేశీ ప్రయాణికులకు అమలు చేసే కొవిడ్‌ నిబంధలను బ్రిటన్‌ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 17 దేశాల ప్రయాణికుల కోసం ట్రావెల్‌ అడ్వైజరీ జారీ చేయగా.. అందులో భారత్‌ పేరును ప్రస్తావించలేదు. అందువల్ల భారతీయులకు క్వారంటైన్‌ నిబంధనల నుంచి మినహాయింపు లభించని పరిస్థితి. మరోవైపు, బ్రిటన్‌ నిర్ణయంపై భారత్‌ మంగళవారం తీవ్రంగా స్పందించింది. ఆ దేశం వివక్షాపూరితంగా వ్యవహరిస్తోందని, ఈ విషయంలో తమ ఆందోళనలను త్వరగా పరిష్కరించాలని డిమాండ్‌ చేసింది.

టీకా ధ్రువీకరణ పత్రంతోనే సమస్య

కొవిషీల్డ్‌ 2 డోసులు తీసుకున్నప్పటికీ భారతీయ పర్యాటకులకు బ్రిటన్‌లో పది రోజుల క్వారంటైన్‌ తప్పనిసరని, బ్రిటన్‌ తాజాగా జారీచేసిన మార్గదర్శకాల్లో కొవిషీల్డ్‌ ఫార్ములాను ఆమోదించినప్పటికీ ‘క్వారంటైన్‌’లో ఉండాల్సిందేనని బ్రిటన్‌ అధికారులు బుధవారం తెలిపారు. సమస్య కొవిషీల్డ్‌తో కాదని, కరోనా టీకా ధ్రువీకరణ పత్రాలతోనేనని ఈ సందర్భంగా వారు స్పష్టంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని