
Updated : 05 Oct 2021 07:21 IST
Reward: ప్రాణదాతలకు రూ.5వేలు పారితోషికం.. కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం
దిల్లీ: రహదారి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించి ఆదుకునేవారికి రూ.5,000 చొప్పున పారితోషికాన్ని అందించే పథకాన్ని ప్రారంభించినట్లు కేంద్రం తెలిపింది. తొలి గంటలో ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడేవారికి నగదుతో పాటు ప్రశంసాపత్రాన్ని అందిస్తారు. ఈ నెల 15 నుంచి పథకం అమల్లోకి వస్తుంది. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాణదాతలుగా నిలిచిన 10 మందికి రూ.లక్ష చొప్పున అందిస్తారు. ‘‘ప్రమాదం గురించి మొట్టమొదటగా ఎవరైనా పోలీస్‌స్టేషన్‌కు తెలియపరిస్తే వివరాలను వైద్యులతో ధ్రువీకరించుకుని పోలీసులు ఒక రసీదు ఇస్తారు. దాని నకలును జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీకి పోలీసు స్టేషన్ నుంచి పంపిస్తారు. ఎవరైనా తమంతట తాముగా బాధితుల్ని నేరుగా ఆసుపత్రికి తరలిస్తే పూర్తి వివరాలను ఆసుపత్రివారే పోలీసులకు తెలియపరచాలని కేంద్రం మార్గదర్శకాల్లో పేర్కొంది.
Tags :