Section 66A: కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం

కేంద్ర హోంశాఖ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌ -2000 సెక్షన్‌ 66ఎ కింద నమోదైన కేసులను ఎత్తివేయాలని నిర్ణయించింది. రాష్ట్రాలు

Updated : 14 Jul 2021 19:35 IST

దిల్లీ: కేంద్ర హోంశాఖ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌ -2000 సెక్షన్‌ 66ఎ కింద నమోదైన కేసులను ఎత్తివేయాలని నిర్ణయించింది. రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ మేరకు హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. సెక్షన్‌ 66ఎ కింద కొత్తగా కేసులు నమోదు చేయవద్దని ఆదేశించింది.

ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66ఏను రద్దు చేస్తూ 2015లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. తీర్పు వెలువడి ఆరేళ్లు కావస్తున్నా ఆ సెక్షన్‌ కింద దేశవ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదు కావడంపై ఇటీవల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హోంశాఖ తాజా నిర్ణయం తీసుకుంది. సుప్రీం తీర్పు తర్వాత దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 1307 కేసులు నమోదు కాగా.. ఈ విషయంలో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ 50కి పైగా కేసులు నమోదు కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని