Corona: బాంబే ఐఐటీలో కరోనా కలకలం

మహారాష్ట్రలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం కలవరపెడుతోంది. ప్రతిష్ఠాత్మక బాంబే ఐఐటీలో.....

Published : 03 Jun 2022 22:52 IST

ముంబయి: మహారాష్ట్రలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం కలవరపెడుతోంది. ప్రతిష్టాత్మక బాంబే ఐఐటీలో 30 మంది ఈ మహమ్మారి బారిన పడినట్టు అధికారులు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా తమ సంస్థలో 30 మందికి వైరస్‌ సోకినట్టు బాంబే ఐఐటీ అధికార ప్రతినిధి తెలిపారు. అందరికీ స్వల్ప లక్షణాలే ఉన్నాయని.. వారందరినీ తక్షణమే ఐసోలేట్‌ చేసినట్టు వివరించారు. అయితే, ఈ కేసుల నేపథ్యంలో సంస్థలో సౌకర్యాలను, కార్యకలాపాలను నిలుపుదల చేయకుండా ముందస్తు జాగ్రత్తలతో కొనసాగిస్తున్నట్టు పేర్కొన్నారు. 

మరోవైపు, మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 1,134 కొత్త కేసులు, మూడు మరణాలు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 24 తర్వాత ఇంత భారీగా కొత్త కేసులు రావడం ఇదే తొలిసారి. ఒక్క ముంబయి నగరంలోనే 763 కేసులు వెలుగుచూడటం గమనార్హం. బీద్‌, షోలాపూర్‌, పుణె జిల్లాల్లో ఒక్కోటి చొప్పున మరణాలు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కొత్త కేసులతో కలుపుకొంటే రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 5,127కి పెరిగింది. మహారాష్ట్రలో రికవరీ రేటు 98.06 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.87గా ఉంది. కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో మహారాష్ట్ర, తెలంగాణతో పాటు మొత్తం ఐదు రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని