చెన్నై మెట్రో ఛార్జీల తగ్గింపు

చెన్నై మెట్రో ప్రయాణికులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి శుభవార్త చెప్పారు. మెట్రో ఛార్జీలను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు గరిష్ఠ మొత్తంగా ఉన్న ₹70గా ఉన్న టికెట్‌ ఛార్జీని ₹20 మే.....

Published : 21 Feb 2021 01:29 IST

చెన్నై: చెన్నై మెట్రో ప్రయాణికులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి శుభవార్త చెప్పారు. మెట్రో ఛార్జీలను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు గరిష్ఠ మొత్తంగా ఉన్న ₹70గా ఉన్న టికెట్‌ ఛార్జీని ₹20 మేర తగ్గించి ₹50కి పరిమితం చేశారు. కొత్త టికెట్‌ ఛార్జీలు ఫిబ్రవరి 22 నుంచి అమల్లోకి రానున్నాయని ప్రకటించారు.

ఇకపై మొదటి రెండు కిలోమీటర్ల ప్రయాణానికి ₹10; 2 నుంచి 5 కిలోమీటర్లకు ₹20 చెల్లించాల్సి ఉంటుంది. 5 నుంచి 12 కిలోమీటర్ల వరకు ₹30; 12 నుంచి 21 కిలోమీటర్లకు ₹40; 21 నుంచి 32 కిలోమీటర్ల వరకు ₹50 చెల్లించాల్సి ఉంటుంది. అంతకుముందు 0-2కు ₹10; 2-4కు ₹20; 4-6కు ₹30, 6-12 ₹40, 12-18కు ₹50, 18-24కు ₹60, 24 కిలోమీటర్లకు పైబడి ఉన్న దూరానికి టికెట్‌ ధర ₹70గా ఉండేది. అలాగే, చెన్నై మెట్రో రైల్‌ లిమిటెడ్‌ స్మార్ట్‌కార్డ్‌ లేదా క్యూఆర్‌ కోడ్‌ ద్వారా చెల్లించే వారికి 20 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌ మేరకు మెట్రో రైలు ఛార్జీలను తగ్గించినట్లు సీఎం పేర్కొన్నారు. అలాగే, పబ్లిక్‌ హాలిడే, ఆదివారాల్లో రోజువారీ టికెట్‌పై 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని