ఇంట్లో మద్యం ఉంచుకుంటే లైసెన్స్‌ తప్పనిసరి

ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం మద్యం విక్రయాలతో వచ్చే ఆదాయంపై దృష్టి సారించింది. పరిమితికి మించి ఇంట్లో మద్యాన్ని నిల్వ చేసుకుంటే అందుకు లైసెన్స్‌ను తప్పనిసరి చేసింది....

Published : 25 Jan 2021 19:00 IST

లఖ్‌నవూ: ఉత్తర ప్రదేశ్‌లోని ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం మద్యం విక్రయాలతో వచ్చే ఆదాయంపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పరిమితికి మించి ఇంట్లో మద్యాన్ని నిల్వ చేసుకుంటే అందుకు లైసెన్స్‌ను తప్పనిసరి చేసింది. ఇంట్లో 6 లీటర్ల కంటే అధిక మద్యం ఉంచుకుంటే అందుకు లైసెన్స్‌ తీసుకోవాలని ఎక్సైజ్ విభాగం అదనపు ప్రధాన కార్యదర్శి సంజయ్ ఆర్.భూస్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో అమలుచేసిన నూతన ఎక్సైజ్ విధానం ప్రకారం.. 6 లీటర్ల కంటే అధిక మద్యాన్ని నిల్వ చేసుకుంటే ప్రతి సంవత్సరం రూ.12 వేల లైసెన్స్ ఫీజు, రూ.51 వేల సెక్యూరిటీ మొత్తాన్ని జమ చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. 

పరిమితికి మించి మద్యం కొనుగోళ్లకు, రవాణా చేసేందుకు కూడా సదరు లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. నిర్దేశించిన పరిమితి కంటే మద్యం సేవించేందుకు కూడా ఈ లైసెన్స్ పొందడం తప్పనిసరి చేసింది. రాష్ట్రంలో మద్యం విక్రయాల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి రూ.28,340 కోట్ల ఆదాయం లభించింది. నూతన ఎక్సైజ్ విధానాలతో కలిపి 2021-22లో రూ.34,500 కోట్లు రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇవీ చదవండి...

ఆ నోట్లు రద్దు చేస్తారా? ఆర్బీఐ ఏమంటోంది

దేశీయ తయారీకి బడ్జెట్‌లో ఊతం!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని