
Vaccine: ‘ప్రైవేటు’లో టీకా.. కొత్త ధరలివే!
దిల్లీ: ప్రైవేటు ఆస్పత్రుల్లో అందించే కరోనా వ్యాక్సిన్ల ఒక్కో డోసు ధరలను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా నిర్దేశించిన ధరల ప్రకారం.. కొవిషీల్డ్ వ్యాక్సిన్ ధర గరిష్ఠంగా ₹780లుగా ఉండగా.. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా ₹1410, రష్యాకు చెందిన స్పుత్నిక్-వి ₹1145గా ఉండనుంది. అన్ని పన్నులతో పాటు ఆస్పత్రులకు రూ.150 సర్వీస్ ఛార్జి కూడా ఇందులో భాగమేనని కేంద్రం స్పష్టంచేసింది. అధిక ఛార్జీలు వసూలు చేసే ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
దేశవ్యాప్తంగా 18ఏళ్లు దాటిన అందరికీ ఉచితంగా టీకా పంపిణీ చేస్తామని ప్రకటించిన కేంద్రం.. ఉచితంగా వద్దనుకొనేవారి కోసం 25శాతం వ్యాక్సిన్‌ను ప్రైవేటు ఆస్పత్రులకు ఇస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్ గరిష్ఠ ధరపై రూ.150లు మాత్రమే సర్వీస్ ఛార్జి వసూలు చేయాలని ప్రధాని మోదీ నిన్న ఆదేశించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకాలకు ధరలను ఖరారు చేసింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.