కరోనా వర్సెస్ ట్రంప్..!
‘‘బైడెన్ ఎప్పుడూ 200 అడుగుల దూరం నుంచే ఎదుటివారితో మాట్లాడతారు. నేను ఇప్పటివరకు చూసిన అతిపెద్ద మాస్క్ బైడెన్’’ ఇవి అమెరికా అధ్యక్ష అభ్యర్థుల తొలి సంవాదంలో జో బైడెన్‌ను ఉద్దేశంచి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు. ఇది జరిగిన 3 రోజుల్లోనే ట్రంప్‌కు కరోనావైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.
అమెరికా అధ్యక్షుడి కష్టాలను పెంచిన వైరస్
‘‘బైడెన్ ఎప్పుడూ 200 అడుగుల దూరం నుంచే ఎదుటివారితో మాట్లాడతారు. నేను ఇప్పటివరకు చూసిన అతిపెద్ద మాస్క్ బైడెన్’’ ఇవి అమెరికా అధ్యక్ష అభ్యర్థుల తొలి సంవాదంలో జో బైడెన్‌ను ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు. ఇది జరిగిన 3 రోజుల్లోనే ట్రంప్‌కు కరోనావైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ ఘటనతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కష్టాలు మరింత పెరిగిపోయాయి. ఇప్పటికే ఆయన బైడెన్ కంటే వెనుకబడినట్లు పలు సర్వేల్లో తేలింది. దీంతో ట్రంప్ ఓటమికి ఎదురీదాల్సిన పరిస్థితి నెలకొంది. చైనాలో పుట్టిన కొవిడ్ ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికలను శాసించే స్థితికి చేరింది. ఈ సారి ఎన్నికల్లో ట్రంప్‌కు ఇది సవాళ్లను విసురుతోంది.
నిర్లక్ష్యమే చాపకింద నీరై..
మహమ్మారులు వ్యాపించినప్పుడు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసే ‘వైట్‌హౌస్ పాండమిక్ రెస్పాన్స్ టీమ్’ని 2018లోనే ట్రంప్ రద్దు చేశారు. ఆ ఫలితం కరోనా వ్యాప్తి సమయంలో శ్వేతసౌధంపై పడింది. ఈ వైరస్ దెబ్బకు సెప్టెంబర్ 19 నాటికి అమెరికాలో మృతుల సంఖ్య 2 లక్షలను దాటేసింది. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో మనిషి ప్రాణానికి చాలా విలువ ఇస్తారు. అలాంటి చోట్ల కొన్ని నెలల వ్యవధిలోనే లక్షల మంది చనిపోవడం సాధారణ విషయం కాదు.
ఈ ఏడాది అమెరికాలో కరోనావైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి అధ్యక్షుడు ట్రంప్ నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలు మొదటి నుంచి ఉన్నాయి. ట్రావెల్ బ్యాన్ వంటివి అందరికంటే ముందే మొదలు పెట్టినా.. కొవిడ్ నిబంధనల అమలు విషయంలో ఉదాసీనంగా ఉన్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన అధ్యక్షుడే మాస్క్‌ను ధరించరు. ఆయన మాస్కును ధరించిన సందర్భాలు చాలా అరుదు. అసలు శ్వేత సౌధంలో మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేయలేదంటే నిర్లక్ష్యం ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అమెరికాలో ఉద్యోగాలను పెంచుతానని 2016 ఎన్నికల్లో ట్రంప్ హామీ ఇచ్చారు. చైనాతో వాణిజ్యం యుద్ధం మొదలు పెట్టాక అమెరికాలో ఉద్యోగాలు పెరిగిన మాట వాస్తవమే. కొవిడ్ వ్యాపించినా.. లాక్‌డౌన్లను పక్కాగా అమలు చేయడంలో మాత్రం ఆసక్తి చూపలేదు. ఎన్‌ఐఏఐడీ డైరెక్టర్ డాక్టర్ ఫౌచీ ఎంత చెప్పినా ట్రంప్ ఆయన మాటను పెడచెవిన పెట్టారు. ఫలితంగా అమెరికాలో కరోనా కోరలు చాచింది. ఈ దెబ్బకు అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య పెరిగి మే నెల నాటికి దాదాపు 3.8 కోట్లకు చేరింది. ఆ తర్వాత ఆ సంఖ్య కొంత మేరకు తగ్గింది.
ట్రంప్ తన వైఫల్యాలను ఎదుటివారిపై రుద్దడానికి ఏమాత్రం వెనుకాడరు. కరోనా విషయంలో చైనా, ప్రపంచ ఆరోగ్య సంస్థల తప్పులు ఆయనకు ఆయుధాలుగా దొరికాయి. తాను పాలించే దేశంలో వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడంలో వైఫల్యాలకు చైనా, ప్రపంచ ఆరోగ్య సంస్థ సాకుగా చూపించే ప్రయత్నం చేస్తుంటారు. చైనా వల్లే ఆర్థిక వ్యవస్థను మూసేయాల్సి వచ్చిందని ఇటీవల ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో కూడా ఆరోపించారు. వైరస్ విషయంలో ట్రంప్ తొలుత పకడ్బంధీగా వ్యవహరించి.. ఆ తర్వాత చైనాను నిందిస్తే ప్రస్తుతం ఆయన పరిస్థితి మరింత మెరుగ్గా ఉండేది.
అందుకే ఆసుపత్రి నుంచి తొందరగా వైట్‌హౌస్‌కు..
ట్రంప్ మొదటి నుంచి వైరస్ ప్రభావాన్ని తక్కువ చేసి చూపాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. చివరికి ఆయనకే వైరస్ సోకడంతో ఆసుపత్రిలో చేరారు. దీంతో ఈ వైరస్ తీవ్రమైంది కాదని చెప్పడం కోసం ఆయన వీలైనంత తొందరగా వాల్టీర్ రీడ్ ఆసుపత్రి నుంచి తిరిగొచ్చారు. అంతేకాదు.. వైరస్ కారణంగా మెయిల్ బ్యాలెట్ వాడాలనే ప్రతిపాదనను ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు తాను చికిత్స చేయించుకొని తిరిగి రావడంతో ‘వైరస్‌కు భయపడాల్సిన పనిలేదు’ అంటూ మెయిల్ బ్యాలెట్ విషయంలో తన వాదనను బలపర్చుకొనే ప్రయత్నం చేశారు. ‘‘ టీకా ఉన్న ఫ్లూ వ్యాధికే దాదాపు లక్షమంది చనిపోతున్నారు. అలా అని దేశాలను లాక్‌డౌన్ చేస్తామా?మనం దానితో కలిసి జీవించడం నేర్చుకున్నాం. అలానే ఎక్కుమందికి ప్రమాదకారి కానీ కొవిడ్‌తో కూడా జీవించడం నేర్చుకుందాం’’ అంటూ ట్వీట్ చేశారు.
కానీ, శ్వేత సౌధంలో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగితే మాత్రం అది ట్రంప్ ఇమేజ్‌ను దారుణంగా దెబ్బతీయడం ఖాయం. ట్రంప్ చర్యల వల్ల ‘అధ్యక్షుడు కొవిడ్ బారిన పడ్డారు’ అనే జాలి కూడా ప్రజల్లో నుంచి మాయమైపోతుందని రిపబ్లికన్ పార్టీ వ్యూహకర్తలు ఆదోళన చెందుతున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది.
చైనా విషయంలో కఠినం..
వైరస్ వ్యాప్తికి కారణమైన చైనా విషయంలో తాను చాలా కఠినంగా ఉంటానని నిరూపించుకొనేందుకు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల తేదీలు దగ్గరపడే కొద్దీ ఆయన మరింత కఠనవైఖరిని తీసుకోవచ్చు. ట్రంప్ ప్రత్యర్థి జో బైడెన్ మాత్రం చైనా విషయంలో ఆచితూచి స్పందిస్తున్నారు. ఈ ఒక్క అంశం మాత్రమే ట్రంప్‌కు కలిసొచ్చే అవకాశం ఉంది.
స్వింగ్‌స్టేట్స్‌లో ట్రంప్ పరిస్థితి ఘోరం..
అమెరికాలో రిపబ్లికన్లు, డెమోక్రాట్లకు పెట్టని కోటవలే కొన్ని రాష్ట్రాలు ఉంటాయి. ఇవి కాకుండా అధ్యక్ష అభ్యర్థిని బట్టి పార్టీకి మద్దతిచ్చే రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. వీటిని అక్కడ స్వింగ్ స్టేట్స్‌గా వ్యవహరిస్తుంటారు. దిగార్డియన్ పోల్ ట్రాకర్ ప్రకారం ఈ రాష్ట్రాల్లో జో బైడెన్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్క ఐయోవా రాష్ట్రంలోనే ట్రంప్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. అత్యంత కీలకమైనదిగా భావించే ఫ్లోరిడాలో బైడెన్ స్పష్టమైన ఆధిక్యంలో నిలిచారు. ఫ్లోరిడాలో ఎవరు గెలిస్తే వారు అధ్యక్ష పీఠం చేపడతారనే సెంటిమెంట్ ఉంది. 1964 నుంచి ఇది కొనసాగుతోంది. 2000 జార్జి డబ్ల్యూ బుష్.. 2008లో ఒబామాకు మద్దతు ఇచ్చింది. ఫ్లోరిడాలో 7.20 లక్షల కరోనా కేసులు నమోదై.. 14 వేల మందికిపైగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. పెన్సిల్వేనియా, ఒహైయో, మిషిగాన్, నార్త్ కరోలినా, అరిజోనా, విస్కిన్సన్ రాష్ట్రాల్లో కూడా బైడెన్ ముందున్నారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Rahul Gandhi: రాహుల్ గాంధీకి జైలు శిక్ష.. ఎంపీగా అనర్హుడవుతారా..?
-
Movies News
Vishwak Sen: ఆ రెండు సినిమాలకు సీక్వెల్స్ తీస్తాను: విష్వక్ సేన్
-
Politics News
MLC Election: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ విజయం
-
General News
TSRTC ఆన్లైన్ టికెట్ బుకింగ్‌లో ‘డైనమిక్ ప్రైసింగ్’!
-
Crime News
TSPSC: పేపర్ లీకేజీ కేసు.. ముగ్గురికి 14 రోజుల రిమాండ్
-
Sports News
Virat Kohli-RCB: విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేస్తాడు: ఆకాశ్ చోప్రా