శునకానికి పిల్లి మసాజ్‌.. వీడియో వైరల్‌

శునకం కనిపిస్తే చాలు పిల్లి పారిపోవడం మనం చూసి ఉంటాం. కుక్క, పిల్లి జాతుల పోరాటం అనాదిగా వస్తోందని చెబుతుంటారు. అయితే ఇక్కడో...

Updated : 11 Nov 2020 15:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శునకం కనిపిస్తే చాలు పిల్లి పారిపోవడం మనం చూసి ఉంటాం. కుక్క, పిల్లి జాతుల వైరం అనాదిగా వస్తోందని చెబుతుంటారు. అయితే ఇక్కడో పిల్లి మాత్రం ఎంచక్కా శునకానికి మసాజ్‌ చేస్తూ ఉన్న వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మార్జాలం మసాజ్‌ చేస్తుంటే శునకం హాయిగా సేదదీరుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కుక్క, పిల్లి సావాసం ఇలాగే వర్థిల్లాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. రెండు రోజుల కిందట  (నవంబర్‌ 9) సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా.. దాదాపు 10వేలకుపైగా లైకులు వచ్చాయి. పిల్లి అలా తలమీద రుద్దుతూ ఉంటే శునకం వెలిబుచ్చిన హావభావాలు నెటిజన్లను ఆకర్షించాయి. ఆ వీడియో ఏంటో మీరూ ఓసారి చూసేయండి...


Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts