
Honey trap: మహిళా నేత...‘హనీ’వల
బెంగళూరు(యలహంక),న్యూస్టుడే: తనతో కలిసి నగ్నంగా ఉన్న వివిధ పార్టీలకు చెందిన నాయకుల చిత్రాలను చూపి బెదిరించి నగదు లాక్కుంటున్నారనే (హనీట్రాప్) ఆరోపణలపై ఓ జాతీయ పార్టీకి చెందిన మహిళ నాయకురాలిని అన్నపూర్ణేశ్వరి నగర పోలీసులు అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉండటం, మరి కొందరిని అరెస్టు చేయాల్సి ఉన్నందున ఆమె వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. కొప్పళ్కు చెందిన ఆమె నగరంలోని విజయనగరలో నివసిస్తున్నారు. రాష్ట్రస్థాయి రాజకీయ పార్టీలో మంచి స్థానంలో ఉన్న ఆమె తమిళనాడులోని ఆ పార్టీ మహిళ విభాగం ఇన్ఛార్జి బాధ్యతలను నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అనేక మందిని ఆమె బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలియవచ్చిందని పోలీసులు వెల్లడించారు. గుత్తేదారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.