
Updated : 28 Jan 2022 10:14 IST
Shweta Tiwari:దేవుడిపై నటి శ్వేతా తివారీ వ్యాఖ్యలు వివాదాస్పదం
మధ్యప్రదేశ్ హోం మంత్రి ఆగ్రహం
భోపాల్: ప్రముఖ బుల్లితెర, సినీ నటి శ్వేతా తివారీ దేవుడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. తాను నటిస్తున్న ఓ వెబ్ సిరీస్ వివరాలను వెల్లడించేందుకు ఆమె బుధవారం భోపాల్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో ఆమె సరదాగా మాట్లాడుతూ.. తన లోదుస్తులకు, దేవుడికి ముడిపెడుతూ ఓ వ్యాఖ్య చేశారు. శ్వేత వ్యాఖ్యలు హిందూ దేవుళ్లను కించపరిచేలా ఉన్నాయంటూ నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంపై మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి 24 గంటల్లోగా నివేదిక అందజేయాలని భోపాల్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు.
Tags :