
KTR: కేటీఆర్ వినతిపై వరంగల్ యువకుడికి అత్యవసర వీసా
ఈనాడు, హైదరాబాద్: వరంగల్‌లో విషమ పరిస్థితుల్లో ఉన్న తల్లిని చూసేందుకు వీలుగా స్వదేశానికి పయనమయ్యేందుకు అమెరికాలో ఉన్న మాదాడి వినయ్‌రెడ్డికి అత్యవసర వీసా మంజూరైంది. రాష్ట్ర మంత్రి కేటీఆర్ వినతి మేరకు అమెరికాలోని భారతీయ రాయబార కార్యాలయం ఈ వీసాను ఇప్పించింది. తన తల్లి వరంగల్‌లో చావుబతుకుల మధ్య ఉందని, ఒక్కగానొక్క కొడుకైన తన కోసం తపిస్తోందని, అమెరికాలో ఈ-వీసాలను రద్దు చేసినందున తనకు వరంగల్ వెళ్లేందుకు అవకాశం కల్పించాలని వినయ్ మంత్రిని గురువారం ట్విటర్లో కోరారు. ఈ మేరకు మంత్రి స్పందించి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌కు ట్విటర్ ద్వారా అమెరికాలోని భారత రాయబార కార్యాలయ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. కేటీఆర్ వినతి మేరకు రాయబార కార్యాలయ అధికారులు అత్యవసర వీసా జారీ చేశారు. వినయ్ శుక్రవారం ఉదయమే హైదరాబాద్‌కు బయల్దేరారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.