Updated : 02 May 2022 04:25 IST

Crime News: నర్సుగా చేరిన మర్నాడే ఆస్పత్రి గోడకు శవమై వేలాడి..!

 యూపీలో ఘటన.. హత్యాచారంగా అనుమానాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: నర్సుగా ఉద్యోగంలో చేరిన మరుసటి రోజే ఓ యువతి ఆస్పత్రి గోడకు శవంగా వేలాడిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో చోటు చేసుకొంది. ఉన్నావ్‌లోని న్యూజీవన్‌ ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆస్పత్రిని ఐదు రోజుల క్రితమే ప్రారంభించడం గమనార్హం. శుక్రవారం ఓ యువతి నర్సుగా ఉద్యోగంలో చేరింది. శనివారం ఉదయం ఆస్పత్రి  గోడకు ఉన్న పిల్లర్‌ ఊచలకు వేలాడుతూ కనిపించింది. ఆమె మెడకు తాడుతో ఉచ్చు బిగించి ఉంది. తమ కూతురిపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో ముగ్గురుని అనుమానితులుగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.  

ఈ ఘటనపై సీనియర్‌ పోలీసు అధికారి శశిశేఖర్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘‘న్యూజీవన్‌ ఆస్పత్రి వద్ద ఓ యువతి మృతదేహాన్ని గుర్తించాం. మృతికి కారణాలు తెలుసుకోవడానికి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించాం. యువతి కుటుంబం దీనిని హత్యాచారంగా పేర్కొంటోంది. ముగ్గురిపై కేసు నమోదు చేశాం’’ అని పేర్కొన్నారు. ఉన్నావ్‌లో ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. దర్యాప్తు జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకొంటామని శశిశేఖర్‌ సింగ్‌ వెల్లడించారు.

మహిళలపై ఎక్కువ నేరాలు జరిగే ప్రాంతంగా ఉన్నావ్‌కు పేరుంది. గతంలో ఇక్కడి మాజీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సెంగర్‌కు అత్యాచారం కేసులోనే జైలు శిక్ష పడింది. అప్పట్లో కుల్దీప్‌ ఓ బాలికపై అత్యాచారం చేశాడు. అనంతరం ఆ బాలిక తండ్రి మరణానికి కారణమయ్యాడు.

Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని