18 Pages: ప్రేమించడానికి కారణం ఉండకూడదు

నిఖిల్‌ సిద్ధార్థ్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా పల్నాటి సూర్య ప్రతాప్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘18 పేజెస్‌’. బన్నీ వాసు నిర్మాత. దర్శకుడు సుకుమార్‌ కథ అందించారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు

Updated : 08 Apr 2022 14:02 IST

నిఖిల్‌ సిద్ధార్థ్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా పల్నాటి సూర్య ప్రతాప్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘18 పేజెస్‌’. బన్నీ వాసు నిర్మాత. దర్శకుడు సుకుమార్‌ కథ అందించారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ చిత్ర వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఓ సరికొత్త న్యూఏజ్‌ లవ్‌స్టోరీతో రూపొందుతున్న చిత్రమిది. ఇందుకు తగ్గట్లుగానే ప్రచార చిత్రాన్ని రొమాంటిక్‌ యాంగిల్‌లో ముస్తాబు చేశారు. ‘‘నాకు తెలియని ఒక అమ్మాయి ఎప్పుడూ ఓ విషయం చెబుతుండేది. ప్రేమించడానికి రీజన్‌ ఉండకూడదు. ఎందుకు ప్రేమించామా? అంటే అన్సర్‌ ఉండకూడదు’’ అంటూ గ్లింప్స్‌లో నిఖిల్‌ చెప్పిన డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. ‘‘నన్నయ్య రాసిన కావ్యమాగితే.. తిక్కన తీర్చెనుగా.. రాధమ్మ ఆపిన పాట మధురిమ.. కృష్ణుడు పాడెనుగా’’ అంటూ గ్లింప్స్‌ బ్యాగ్రౌండ్‌లో వినిపించిన పాట సినిమాపై ఆసక్తి పెంచేలా ఉంది. త్వరలో పూర్తి పాట విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. సుకుమార్‌ రైటింగ్స్‌, జీఏ2 పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపీ సుందర్‌ స్వరాలందించారు. నవీన్‌ నూలి ఎడిటర్‌గా, ఏ వసంత్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని