katrina kaif: ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది

హాలీవుడ్‌ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది.

Updated : 27 Apr 2024 09:23 IST

హాలీవుడ్‌ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో కత్రినా ముచ్చటించింది. ‘ఇటీవలే ఓ హాలీవుడ్‌ చిత్రంలో నటించే అవకాశం వస్తే కొన్ని కారణాల వల్ల తిరస్కరించాను. తిరిగి తప్పక ఆ అవకాశం వస్తుందని నమ్ముతున్నా. దాంతో నా సినీ జీవితం అనే పుస్తకంలో ఓ కొత్త పేజీ రూపుదిద్దుకుంటుందని భావిస్తున్నా’ అని అంది. చిత్రపరిశ్రమలో తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ...‘హిందీలో చేసిన ‘బూమ్‌’ తర్వాత నేను ‘మల్లీశ్వరి’తో దక్షిణాదికి పరిచయమయ్యా. అక్కడి నుంచే కెమెరా అనుభవం పొందడం ప్రారంభించాను. తర్వాత నెమ్మదిగా దర్శకనిర్మాతలతో చర్చించడం అలవాటు చేసుకున్నా. అనుకున్నవన్నీ సాధించాను. ఎప్పటికీ నా మనసంతా సినిమాలపైనే ఉంటుంది’ అని తెలిపింది. ప్రేక్షకులకు ఎప్పుడూ మొదటిస్థానం ఇస్తాననీ, ఏ కథకు వారు బాగా కనెక్ట్‌ అవుతారని ఆలోచిస్తూ..మంచి కథలను ఎంచుకోవడానికి ప్రయత్నిస్తాననీ చెప్పుకొచ్చింది కత్రినా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని