‘బెస్ట్‌ ఆఫ్‌ కేజీఎఫ్‌’ చూశారా..?

కేజీఎఫ్‌.. ఒకే ఒక్క సినిమా హీరోను.. డైరెక్టర్‌ను.. పాన్‌ ఇండియా స్థాయికి తీసుకెళ్లింది. ఒక్క సినిమా కన్నడ సినిమా ఖ్యాతిని ఆకాశానికెత్తింది. కన్నడ హీరో యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా ప్రేక్షకులను ఎంతగా ఉర్రూతలూగించిందో ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు.

Updated : 29 Jun 2023 17:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేజీఎఫ్‌.. ఒకే ఒక్క సినిమా.. హీరోను.. డైరెక్టర్‌ను.. పాన్‌ ఇండియా స్థాయికి తీసుకెళ్లింది. ఒక్క సినిమా కన్నడ సినిమా ఖ్యాతిని ఆకాశానికెత్తింది. కన్నడ నటుడు యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా ప్రేక్షకులను ఎంతగా ఉర్రూతలూగించిందో ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు.. దానికి సీక్వెల్‌గా కేజీఎఫ్‌2 కూడా అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

కేజీఎఫ్‌ ప్రభావం ఎంతగా ఉందంటే.. డైరెక్టర్‌ ప్రశాంత్‌నీల్‌ ‘కేజీఎఫ్‌:ఛాప్టర్‌2’ గురించి ప్రకటించింది మొదలు.. సినిమా ఎప్పుడొస్తుందా అని ఆతృతగా అందరూ ఎదురుచూసేలా చేసింది. అభిమానుల ఎదురుచూపులకు తగ్గట్టుగానే షూటింగ్‌ కూడా శరవేగంగా సాగుతోంది. కరోనా.. లాక్‌డౌన్‌ వల్ల మధ్యలోనే చిత్రీకరణకు ఆటంకం కలిగినా.. లాక్‌డౌన్‌ తర్వాత ప్రారంభమై మళ్లీ వేగం పుంజుకొంది. హీరోకు సంబంధించిన సన్నివేశాలు మొత్తం ఇప్పటికే చిత్రీకరించారు. సీక్వల్‌లో ప్రతినాయకుడిగా బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్‌ దత్‌.. మరో కీలకపాత్రలో ప్రకాశ్‌రాజ్‌ కనిపించనుండటం ఈ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది. శ్రీనిధి శెట్టి కథానాయిక. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అలరించనుంది.

ఇదంతా ఇలా ఉండగా.. కేజీఎఫ్‌:ఛాప్టర్‌1లోని కీలక సన్నివేశాలతో కూడిన ఓ వీడియోను ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ప్రైమ్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్టు చేసింది. 7.36నిమిషాల నిడివి గల ఆ వీడియోను ‘బెస్ట్‌ ఆఫ్‌ కేజీఎఫ్‌’ పేరుతో విడుదల చేసింది. మీరూ చూసేయండి మరి..

ఇవీ చదవండి..

‘కేజీఎఫ్‌-2’ టీజర్‌ డేట్‌ ఫిక్స్‌..!

కేజీఎఫ్‌ ఎక్స్‌క్లూజివ్‌ స్టిల్‌ చూశారా..?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని