Jyothika: ఇదే మా రిలేషన్‌షిప్‌ సీక్రెట్‌: జ్యోతిక

ఇండస్ట్రీకి వచ్చాక తాను కలుసుకున్న తొలి వ్యక్తి సూర్య అని జ్యోతిక తెలిపారు. 

Published : 30 Apr 2024 19:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆఫ్‌స్క్రీన్‌, ఆన్‌స్క్రీన్‌లో హిట్‌ జోడి అనగానే గుర్తోచ్చేది సూర్య, జ్యోతికలే (Jyothika). సమయం వచ్చినప్పుడల్లా ఒకరిపై ఉన్న ప్రేమను మరొకరు బయటపెడుతుంటారు. తాజాగా సూర్య (Suriya) గురించి జ్యోతిక మాట్లాడారు. బలమైన బంధానికి సీక్రెట్‌ను వివరించారు. ‘సూర్య నాకు మంచి స్నేహితుడు. నేను ఇండస్ట్రీకి వచ్చాక పరిచయమైన మొదటి వ్యక్తి ఆయనే. ఆయనతోనే నా మొదటి సినిమా చేశాను. చాలాకాలం స్నేహితులుగా ఉన్నాం. ఒకరినొకరం పూర్తిగా అర్థం చేసుకున్నాక పెళ్లి చేసుకున్నాం. అంతకాలం స్నేహితులుగా ఉన్నాం కాబట్టే మా రిలేషన్‌ బలంగా ఉంది’ అని చెప్పారు. తర్వలోనే వీళ్లిద్దరూ కలిసి నటించనున్నారంటూ వస్తోన్న వార్తలపై మాట్లాడుతూ సరైన స్క్రిప్ట్‌ కోసం చర్చలు జరుపుతున్నామన్నారు. మంచి కథ ఉంటే కచ్చితంగా కలిసి నటిస్తామని స్పష్టంచేశారు.

1999లో వచ్చిన ‘పూవెల్లం కేట్టుప్పార్‌’ మొదలుకొని వీళ్లిద్దరూ ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించి, మెప్పించారు. మళ్లీ వీరిద్దరిని తెరపై ఎప్పుడెప్పుడు జంటగా చూస్తామా అని సినీప్రియులు ఎదురుచూస్తున్నారు. ‘‘బెంగుళూరు డేస్‌’ ఫేమ్‌ అంజలి మేనన్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రానుందని అందులో సూర్య, జ్యోతిక కలిసి నటించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలో దీనికి సంబంధించిన విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఇప్పుడు జ్యోతిక కామెంట్స్‌తో ఈ ప్రచారానికి బలం చేకూరింది. దాదాపు 18 ఏళ్ల తరవాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమా ఎలా ఉండబోతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని