కంగనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు కోర్టు ఆదేశం

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌పై కర్ణాటకలోని తుమకూరు కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం...........

Published : 09 Oct 2020 20:28 IST

తుమకూరులో నటిపై ఫిర్యాదు

బెంగళూరు: బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌పై కర్ణాటకలోని తుమకూరు జిల్లా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఆందోళనలు చేస్తున్న వారిపై తీవ్రంగా విమర్శిస్తూ కంగన సెప్టెంబర్‌ 21న చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. ఆందోళనలు చేస్తున్న రైతులను టెర్రరిస్ట్‌లతో పోలుస్తూ ఆమె ట్వీట్‌ చేశారని పేర్కొంటూ రమేశ్‌ నాయక్‌ అనే ఓ న్యాయవాది కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఫస్ట్‌క్లాస్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ న్యాయస్థానం ఆమెపై క్యాతసంద్ర పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఆదేశించింది. సీఆర్‌పీసీ సెక్షన్‌ 156 (3)కింద ఫిర్యాదుదారుడు దర్యాప్తు కోసం దరఖాస్తు చేసినట్టు కోర్టు తెలిపింది. దీనిపై నాయక్‌ స్పందిస్తూ.. కంగన చేసిన ట్వీట్‌ తననెంతగానో బాధించిందని, ఆమెపై కేసు పెట్టేలా ప్రేరేపించిందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని