నాని28 సినిమా టైటిల్‌ తెలుసా..?

సినిమాల విషయంలో నేచురల్‌ స్టార్‌ నాని జోరు పెంచారు. ప్రస్తుతం ‘టక్‌ జగదీష్‌’ చిత్రంలో నటిస్తున్న ఆయన త్వరలో ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆయన తన 28వ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

Updated : 22 Nov 2020 00:09 IST

ఆకట్టుకునేలా కొత్త సినిమా కర్టన్‌రైజర్‌

హైదరాబాద్‌: సినిమాల విషయంలో నేచురల్‌ స్టార్‌ నాని జోరు పెంచారు. ప్రస్తుతం ‘టక్‌ జగదీష్‌’ చిత్రంలో నటిస్తున్న ఆయన త్వరలో ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆయన తన 28వ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం ఈ సినిమా టైటిల్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. ‘అంటే... సుందరానికీ!’ అనే పేరుతో రానున్న ఈ చిత్రానికి వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహించనున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా కర్టన్‌రైజర్‌ ఆకట్టుకునేలా ఉంది.

సంగీత ప్రధానంగా సాగే రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను అలరించనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో నాని సరసన మలయాళీ భామ నజ్రియా ఫహాద్‌ సందడి చేయనున్నారు. ఆమె కథానాయికగా నటించనున్న మొదటి తెలుగు చిత్రమిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని