
ప్రముఖ హాలీవుడ్ నటుడికి కరోనా!
బ్యాట్‌మాన్ షూటింగ్ నిలిపివేత
లాస్ ఏంజిల్స్: ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబర్ట్ పాటిన్సన్ కొవిడ్-19 బారిన పడ్డారు. దీనితో ఈయన టైటిల్ రోల్‌లో నటిస్తున్న ‘ద బ్యాట్‌మన్’ చిత్ర నిర్మాణానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న వార్నర్ బ్రదర్స్ సంస్థ.. చిత్రనిర్మాణ బృందంలో బ్రిటన్‌కు చెందిన ఓ సభ్యునికి కరోనా వైరస్ సోకటంతో చిత్ర నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. 34 ఏళ్ల రాబర్ట్ పాటిన్సన్.. హ్యారీ పోటర్, ట్విలైట్ తదితర చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించారు. కాగా ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన ‘టెనెట్’లో కూడా కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో భారతీయ నటి డింపుల్ కపాడియా కూడా నటించడం విశేషం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.