Fire Accident: సినిమా సెట్‌లో భారీ అగ్నిప్రమాదం
ముంబయి: మహారాష్ట్రలోని ముంబయి శివారు అంధేరి వెస్ట్ ప్రాంతంలో ఉన్న చిత్రకూట్ మైదానంలో పక్క పక్కనే వేసిన రెండు సినిమా సెట్స్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు. సాయంత్రం 4.30 గంటలకు మొదలైన మంటలు రాత్రి తొమ్మిదిన్నరకు అదుపులోకి వచ్చాయి. 8 ఫైర్ ఇంజిన్లు, అయిదు నీటి జెట్టీలతో సిబ్బంది శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకువచ్చారు. ఇందులో ఒక దానిలో రాజశ్రీ ప్రొడెక్షన్స్, మరొకదానిలో లవ్ రంజన్ కొత్త సినిమాల చిత్రీకరణలు జరుగుతున్నాయి. చిత్రీకరణలు జరుగుతుండగా అగ్గి రాజుకొని, ఈ ప్రమాదం సంభవించిందని ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ ప్రధాన కార్యదర్శి అశోక్ దూబే తెలిపారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మనీశ్ దేవాశీ (32) అనే యువకుణ్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అగ్నిప్రమాదంతో రణ్‌బీర్-శ్రద్ధాకపూర్ జంటగా నటిస్తోన్న లవ్ రంజన్ సినిమా షూట్ వాయిదా పడింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Hyderabad News: ఊరెళ్లొద్దంటే చంపేశాడు.. 17 రోజులకు వీడిన జంట హత్యల మిస్టరీ
-
Ap-top-news News
Vizag Beach: వైజాగ్ ఆర్కే బీచ్‌లో నల్లగా మారిపోయిన ఇసుక..
-
Ts-top-news News
TS EAMCET: నేడు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్‌లో..
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (12/08/2022)
-
World News
China: మసూద్ అజార్ సోదరుడికి చైనా అండ.. భారత్ ప్రయత్నాలకు అడ్డుపుల్ల..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (12/08/2022)
- Arjun Tendulkar: ముంబయిని వీడనున్న అర్జున్ తెందుల్కర్
- Vizag Beach: వైజాగ్ ఆర్కే బీచ్‌లో నల్లగా మారిపోయిన ఇసుక..
- AP Govt: మరో బాదుడు
- సారూ.. ఈ తిండి ఎలా తినగలం?.. నడిరోడ్డుపై ఏడ్చేసిన కానిస్టేబుల్
- కొన్నిసార్లు నోరు విప్పకపోవడమే బెటర్.. ఎందుకంటే! : విజయ్ దేవరకొండ
- Viral Video: పిల్లలకు తిండిపెట్టాలా? చంపుకోవాలా?.. ఓ తల్లి ఆవేదన!
- Social Look: యశ్, మహేశ్ ‘రాఖీ’ విషెస్.. ఈ హీరోయిన్ల సోదరులని చూశారా!
- Arun Vijay: వారి మధ్య ఐక్యత లేకపోవడం వల్లే కోలీవుడ్ నష్టపోతోంది: అరుణ్ విజయ్
- Kajal Aggarwal: ‘బాహుబలి’ కట్టప్పగా మారిన కాజల్.. ప్రభాస్‌గా ఎవరంటే?