Akshay Kumar: స్టేజ్‌పైనే కన్నీరు పెట్టుకున్న స్టార్‌హీరో

బాలీవుడ్‌ స్టార్‌హీరో అక్షయ్‌కుమార్‌ (Akshay Kumar) కన్నీరు పెట్టుకున్నారు. తన తదుపరి సినిమా ‘రక్షాబంధన్‌’ (Raksha Bandhan) ప్రమోషన్స్‌లో భాగంగా ఓ రియాల్టీ షోలో పాల్గొన్న ఆయన తన కుటుంబం గురించి చెబుతూ...

Published : 06 Aug 2022 01:36 IST

ముంబయి: బాలీవుడ్‌ స్టార్‌హీరో అక్షయ్‌కుమార్‌ (Akshay Kumar) కన్నీరు పెట్టుకున్నారు. తన తదుపరి సినిమా ‘రక్షాబంధన్‌’ (Raksha Bandhan) ప్రమోషన్స్‌లో భాగంగా ఓ రియాల్టీ షోలో పాల్గొన్న ఆయన తన కుటుంబం గురించి చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. ‘రక్షాబంధన్‌’ స్పెషల్‌గా ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌ ప్రోమో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అసలు అక్షయ్‌ కన్నీరు పెట్టుకోవడానికి కారణమేమిటంటే..

అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఫీల్‌గుడ్‌ కుటుంబ కథా చిత్రం ‘రక్షాబంధన్‌’. ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా అక్షయ్‌ ‘సూపర్‌స్టార్‌ సింగర్‌-2’ ప్రోగ్రామ్‌లో స్పెషల్‌ గెస్ట్‌గా  పాల్గొన్నారు. ‘రక్షాబంధన్‌’ స్పెషల్‌గా సిద్ధమైన ఈ ఎపిసోడ్‌లో చిన్నారులు తమ పాటలతో మెప్పించారు. ఇదిలా ఉండగా, ఈ షోలో అక్షయ్‌కి ఓ సర్‌ప్రైజ్‌ లభించింది. అక్షయ్‌ని మెచ్చుకుంటూ ఆయన సోదరి అల్కా భాటియా ఓ ఆడియో మెస్సేజ్‌ పంపించింది. ‘‘రాజు.. ఇటీవల రాఖీ పండుగ గురించి వేరే ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు నువ్వే గుర్తుకువచ్చావు. మంచి, చెడు.. అన్ని వేళలా నువ్వు నా పక్కనే ఉన్నావు. సోదరుడిగానే కాకుండా స్నేహితుడు, తండ్రిగా ఉండి.. నన్ను అనుక్షణం సంరక్షిస్తున్నందుకు కృతజ్ఞతలు’’ అంటూ అన్నయ్యతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. అల్కా పంపిన సందేశం విని అక్షయ్‌ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. స్టేజ్‌పైనే కన్నీరు పెట్టేసుకున్నారు. అనంతరం సోదరి గురించి మాట్లాడుతూ.. ‘‘నా చిన్నప్పుడు మేము చాలా చిన్న ఇంట్లో ఉండేవాళ్లం. ఆ సమయంలో ఈ దేవత మా జీవితాల్లోకి వచ్చింది. ఆమె రాకతో మా జీవితం మొత్తం మారిపోయింది. సోదరి ప్రేమను మించిన గొప్ప బంధం ఇంకేం ఉంటుంది’’ అని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని