Attack: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ యోధుడు
జాన్ అబ్రహం సూపర్‌సోల్జర్‌గా నటిస్తున్న చిత్రం ‘ఎటాక్-1’. ఈ సినిమాలోని ‘మే నై టుట్నా’’ అంటూ సాగే పాటను శనివారం సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ప్రకాష్‌రాజ్, రకుల్ ప్రీత్‌సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తదితరులు ఈ పాటలో
జాన్ అబ్రహం సూపర్‌సోల్జర్‌గా నటిస్తున్న చిత్రం ‘ఎటాక్-1’. ఈ సినిమాలోని ‘మే నై టుట్నా’’ అంటూ సాగే పాటను శనివారం సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ప్రకాష్‌రాజ్, రకుల్ ప్రీత్‌సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తదితరులు ఈ పాటలో కనిపించారు. జాన్ అబ్రహం సూపర్ సోల్జర్‌గా మారే క్రమంలో వచ్చే సన్నివేశాలతో గీతాన్ని తీర్చిదిద్దారు. కథానాయకుడు కండలు తిరిగిన దేహంతో వీధుల్లో పరిగెత్తడం, జిమ్‌లో కసరత్తులు చేయడం చూపించారు. ఈ సందర్భంగా జాన్ మాట్లాడుతూ ‘‘ఎటాక్ ఒక విజువల్ వండర్‌గా రూపొందింది. పబ్జీ, మార్షల్ కాంబ్యాట్ వంటి వీడియో గేమ్స్‌ను మించిన యాక్షన్ అనుభూతి ఈ చిత్రంలో ఉంటుంది. మానవాతీత శక్తుల కలిగిన యోధుడిలా నేను కన్పించనున్నా. ప్రపంచం భవిష్యత్తులో చూడనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ(ఏఐ)సైనికుడు ఎలా ఉంటాడో ఇందులో చిత్రీకరించాం. చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఈ సినిమాకు ఓ నిర్మాతగానూ మారాల్సి వచ్చింది. ఏప్రిల్ 1న ప్రేక్షకులను యాక్షన్ హంగామాతో ఆకట్టుకుంటాం.’’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
నిండు గర్భిణిపై వైకాపా నాయకుల దాడి
-
‘డ్రగ్స్ ఇచ్చి.. నన్ను లైంగికంగా వేధించారు’..: మహిళా మంత్రి