Indian Army: మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ

విషమ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోన్న ఓ గర్భిణిని విపత్కర వాతావరణ పరిస్థితుల నడుమ ఆస్పత్రికి తరలించిన సైన్యం.. ఆమె ప్రాణాలను కాపాడింది.

Published : 05 May 2024 18:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత సైన్యం (Indian Army) మానవత్వం చాటుకుంది. విషమ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోన్న ఓ గర్భిణిని విపత్కర వాతావరణ పరిస్థితుల నడుమ సురక్షిత ప్రదేశానికి తరలించి.. సకాలంలో చికిత్స అందేలా చూసి, ఆమె ప్రాణాలను నిలబెట్టింది. అధికారుల వివరాల ప్రకారం.. జమ్మూ-కశ్మీర్‌ (Jammu Kashmir)లోని కుప్వాడా జిల్లాలో నియంత్రణ రేఖ (LoC) వెంబడి మారుమూల పల్లెకు చెందిన ఓ గర్భిణి ఆరోగ్యం విషమించింది. స్థానికంగా వైద్య నిపుణులు అందుబాటులో లేని దుస్థితి.

ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌

రోడ్డు మార్గంలో వేరేచోటికి తరలించాలన్నా.. స్థానికంగా భారీగా మంచు కురవడంతో రహదారులన్నీ మూసుకుపోయాయి. ఈ విషయం తెలుసుకున్న గుగల్ధార్ బెటాలియన్ వెంటనే రంగంలోకి దిగింది. జుమాగుండ్‌లోని ఆర్మీ యూనిట్‌ నర్సింగ్ అసిస్టెంట్, పీకే గలిలోని బెటాలియన్ వైద్యాధికారి తొలుత ఆమెకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం స్ట్రెచర్‌పైకి చేర్చి.. గ్రామస్థుల సాయంతో కాలినడకన ఇతర ప్రాంతానికి సురక్షితంగా తరలించారు. ప్రజల నమ్మకాన్ని సైన్యం మరోసారి నిలబెట్టుకుందని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని