Australia: ‘డ్రగ్స్‌ ఇచ్చి.. నన్ను లైంగికంగా వేధించారు’..: మహిళా మంత్రి

ఆస్ట్రేలియాలోని ఓ మహిళా ఎంపీకి కొందరు దుండగులు డ్రగ్స్‌ ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు.

Published : 05 May 2024 18:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆస్ట్రేలియా (Australia)లో ఓ మహిళా ఎంపీకి తన సొంత నియోజకవర్గంలోనే దారుణ ఘటన ఎదురైంది. రాత్రి వేళ బయటకు వెళ్లిన ఆమెకు కొందరు దుండగులు మత్తుమందు ఇవ్వడమే కాకుండా లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనను ఆమె స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ఆ రోజు ఏం జరిగిందో వివరించారు.

క్వీన్స్‌లాండ్‌ ఎంపీ బ్రిటనీ లాగా (37).. ఆరోగ్య శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఇటీవల ఒక రోజు సాయంత్రం వేళ ఆమె బయటకు వెళ్లారు. ‘‘ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మత్తు పదార్థాలు ఇచ్చి నాపై అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశా. అనంతరం వైద్యులు నాకు పరీక్షలు నిర్వహించారు. శరీరంలో మత్తు పదార్థాలు ఉన్నట్లు ధ్రువీకరించారు. కానీ.. వాటిని నేను తీసుకోలేదు’’ అని వెల్లడించారు. ఈ ఘటన ఏప్రిల్‌ 28న చోటు చేసుకున్నట్లు వివరించారు.

హంతకులకు అడ్రస్‌ చెప్పిన ఇన్‌స్టా పోస్టు.. మోడల్‌ హత్యలో కీలక విషయాలు

తన మాదిరిగా చాలా మంది మహిళలు ఇలాంటివి ఎదుర్కొన్నారని.. బాధితులు తనను కలిసి విషయాన్ని వెల్లడించారని బ్రిటనీ పేర్కొన్నారు. ఆ డ్రగ్స్‌ తన శరీరంపై ప్రభావం చూపాయని.. వారు కూడా మత్తు మందుకు ప్రభావితమై ఉండొచ్చని చెప్పారు. నగరంలో జరుగుతున్న ఈ దారుణాలను అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. బ్రిటనీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఎంపీపై జరిగిన అఘాయిత్యంపై క్వీన్స్‌లాండ్‌ హౌసింగ్‌ మంత్రి మేఘన్ స్కాన్లాన్ స్పందించారు. ఒక నాయకురాలికి ఇలా జరగడం షాక్‌కు గురి చేసిందన్నారు. లైంగిక దాడుల నుంచి మహిళలను రక్షించడంతో పాటు గృహహింసను నిరోధించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని