Deepika Padukone: అయినా ముద్దు సీన్లకు... వయసుతో పనేంటి?: దీపిక
బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచుకున్న నటీమణుల్లో ఒకరు దీపికా పదుకొణె. వివాహం అనంతరం యువ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కాబోయే చిత్రం ‘గెహ్రాహియా’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఫిబ్రవరి 11న స్ట్రీమింగ్ కానుంది.
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి దీపికా పదుకొణె. ప్రస్తుతం ఆమె అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కాబోయే ‘గెహ్రాహియా’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఫిబ్రవరి 11న స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్ర కథలో భాగంగా దీపిక- సిద్ధాంత్ ముద్దు సీన్లు, బోల్డ్‌గా కనిపించాల్సి వచ్చింది. ఇదే విషయంపై ఓ జాతీయ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోల్డ్ సన్నివేశాల గురించి ప్రత్యేకంగా మాట్లాడింది ‘‘ ‘గెహ్రాహియా’లో సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి ఇంటిమేట్ సీన్స్‌లో నటించాను. అయితే ముద్దు సీన్లను చూపించి ప్రేక్షకులను ఎగ్జైట్ చేసి మూవీ చూసేలా చేయాలన్న ఉద్దేశంతో తీయలేదు. కథంతా మోడ్రన్ డే రిలేషన్‌షిప్స్‌తో ముడిపడి ఉంటుంది. ప్రేమలో ఉన్న ఇద్దరూ చివరికి మోసపోతారు. దాని కన్నా ముందు వారి ప్రేమ ప్రయాణంలో వచ్చినవే ఆ సీన్స్’’ అని వివరించింది.
అది నా వ్యక్తిగత అభిప్రాయం...
‘‘ఇంటిమేట్ సీన్స్ అనేవి కథలో భాగంగానే చేస్తాం. అవి కేవలం ఒక వయసు వారు లేదా ఒక జెండర్‌కే పరిమితమని ఆపాదిస్తే నేను అంగీకరించను. కాబట్టి కథ డిమాండ్ చేస్తే అలాంటి సన్నివేశాల్లో నటించేందుకు నేను అంగీకరిస్తా. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇదే అంశంపై యువ దర్శకులు, మహిళా దర్శకులను అడిగితే ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. దీనిపై ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది’’
శకున్ వల్లే ‘గెహ్రాహియా’ ఒప్పుకున్నా
ఏ దర్శకుడైనా తన స్క్రిప్ట్ వినిపించగానే.. అందులో నేను మొదట చూసేది అది.. ‘సౌకర్యం’, ‘నమ్మకం’. దర్శకుడు శకున్ బత్రా ‘గెహ్రాహియా’లోని నా పాత్ర అలిషా గురించి చెప్పగానే.. ఆ రెండూ ఉన్నాయని అనిపించాయి. ఒక విషయం అయితే వంద శాతం చెబుతా. శకున్ బత్రా లాంటి వ్యక్తి ఈ సినిమా చేయకపోయుంటే నేను ఓకే చెప్పేదాన్ని కాదు. ఇంటిమేట్ సీన్స్ విషయంలో నన్ను ఇలానే నటించు అని చెప్పుంటే... వెంటనే నో చెప్పేసేదాన్ని. సినిమాకి అవసరమైన సన్నివేశాలను కంఫర్ట్ ఇచ్చే చిత్రీకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్‌డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్