Doctor G: అమ్మాయిల మధ్య డాక్టర్‌ జీ తిప్పలు

అందరూ అమ్మాయిల మధ్య ఒకే ఒక మగ విద్యార్థి ఉదయ్‌ గుప్తా. ఆర్థోపెడిక్స్‌ చేయాలనుకున్నా గైనకాలజీలో వచ్చి పడతాడు. అక్కడ ఆడవాళ్లతో కలిసి చదవడం అతడికి అస్సలు ఇష్టం లేదు. అయినా తప్పలేదు. వారి మధ్య ఉంటూ అతడు ఎలాంటి తిప్పలు పడ్డాడు? ఈ క్రమంలో ఎలాంటి నవ్వులు పూయించాడు.. అన్నదే కథ. షెఫాలీ షా రూపంలో అతడికో

Updated : 21 Sep 2022 07:03 IST

అందరూ అమ్మాయిల మధ్య ఒకే ఒక మగ విద్యార్థి ఉదయ్‌ గుప్తా. ఆర్థోపెడిక్స్‌ చేయాలనుకున్నా గైనకాలజీలో వచ్చి పడతాడు. అక్కడ ఆడవాళ్లతో కలిసి చదవడం అతడికి అస్సలు ఇష్టం లేదు. అయినా తప్పలేదు. వారి మధ్య ఉంటూ అతడు ఎలాంటి తిప్పలు పడ్డాడు? ఈ క్రమంలో ఎలాంటి నవ్వులు పూయించాడు.. అన్నదే కథ. షెఫాలీ షా రూపంలో అతడికో మెంటర్‌ దొరుకుతుంది. రోగుల నమ్మకం పొందాలంటే నువ్వు మగవాడివి అనే సంగతే మర్చిపోవాలంటుంది. దాన్ని పాటించాడా? లేదా? తెరపైనే చూడాలి. వైవిధ్యమైన పాత్రలకు పెట్టింది పేరైన ఆయుష్మాన్‌ ఖురానా (ayushmann khurrana) ‘డాక్టర్‌ జీ’ (Doctor G) గా టైటిల్‌ పాత్రలో నటిస్తున్నాడు. అనుభూతి కశ్యప్‌ దర్శకురాలు. వినీత్‌ జైన్‌ నిర్మిస్తున్నారు. ఈ కామెడీ డ్రామా ట్రైలర్‌ని సినీవర్గాలు మంగళవారం విడుదల చేశాయి. ఇందులో ఆయుష్మాన్‌కి జోడీగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కనిపించనుంది. అక్టోబరు 14న ఈ చిత్రం విడుదలవుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని