Cinema News: ఘనంగా ‘సాహో’ నటి పెళ్లి
‘సాహో’తో తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ భామ ఎవెలిన్ శర్మ పెళ్లి చేసుకున్నారు. తన ప్రియుడు తుషాన్ భిందీతో ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కరోనా కారణంగా అతి తక్కువమంది కుటుంబసభ్యులు....
ఇంటర్నెట్‌డెస్క్: ‘సాహో’తో తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ భామ ఎవెలిన్ శర్మ పెళ్లి చేసుకున్నారు. తన ప్రియుడు తుషాన్ భిందీతో ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కరోనా కారణంగా అతి తక్కువమంది కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరి వివాహం ఆస్ట్రేలియాలో వేడుకగా జరిగింది. వివాహానికి సంబంధించిన కొన్ని ఫొటోలను సోమవారం ఉదయం ఎవెలిన్ ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. ఓ స్నేహితుడి ద్వారా ఆస్ట్రేలియాకు చెందిన దంత వైద్యుడు, పారిశ్రామిక వేత్త తుషాన్తో ఎవెలిన్కి పరిచయం ఏర్పడింది. అనంతరం వీరిద్దరూ ఒకొరికొకరు మనసు ఇచ్చిపుచ్చుకున్నారు. కొన్నేళ్ల నుంచి ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం పట్ల వారి స్నేహితులు సంతోషిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
జర్మనీకి చెందిన ఎవెలిన్ శర్మ ‘టర్న్ లెఫ్ట్’ అనే హాలీవుడ్ మూవీతో నటిగా వెండితెరకు పరిచయమయ్యారు. అనంతరం ఆమె ‘ఫ్రమ్ సిడ్నీ విత్ లవ్’తో బాలీవుడ్ తెరకు కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు. ‘ఏ జవానీ హై దివానీ’, ‘ఇష్క్’, ‘మే తేరా హీరో’, ‘హిందీ మీడియం’, తదితర చిత్రాల్లో కథానాయికగానే కాకుండా సహాయనటిగాను మెప్పించారు. వీటితోపాలు పలు చిత్రాల్లో ఆమె స్పెషల్ సాంగ్స్ చేసి ప్రేక్షకుల్ని అలరించారు. ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ‘సాహో’లో జెన్నీఫర్ పాత్రలో ఎవెలిన్ మెరిసిపోయిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్‌డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్