
Charitha Kaamakshi:చిరు బిడియం.. మదిలో మోమాటం
నవీన్ బెత్తిగంటి, దివ్య శ్రీపాద జంటగా నటిస్తున్న చిత్రం ‘చరిత కామాక్షి’. చందు సాయి దర్శకుడు. రజిని రెడ్డి నిర్మాత. అబూ స్వరాలందించారు. ఈ సినిమాలోని ‘‘చిరు బిడియం.. మదిలో మోమాటం’’ అనే గీతాన్ని ఇటీవల విడుదల చేశారు. ఈ పాటకు మనోహర్ పలిశెట్టి సాహిత్యమందించగా.. చిన్మయి ఆలపించారు. పాటలో నవీన్, దివ్యల కెమిస్ట్రీ చూడముచ్చటగా కనిపించింది. ‘‘ఓ సరికొత్త కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామ’’న్నారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రానికి కూర్పు: కోడాటి పవన్ కల్యాణ్, ఛాయాగ్రహణం: రాకీ వనమాలి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.