Ram: వారియర్‌ వేగం

రామ్‌ నటిస్తున్న చిత్రం ‘ది వారియర్‌’. లింగుస్వామి దర్శకుడు. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. కృతి శెట్టి కథానాయిక. ఆది పినిశెట్టి, అక్షరా గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ ద్విభాషా చిత్రం జులై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారంతో దీని చిత్రీకరణ   పూర్తయింది.

Updated : 07 Dec 2022 20:39 IST

రామ్‌ నటిస్తున్న చిత్రం ‘ది వారియర్‌’. లింగుస్వామి దర్శకుడు. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. కృతి శెట్టి కథానాయిక. ఆది పినిశెట్టి, అక్షరా గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ ద్విభాషా చిత్రం జులై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారంతో దీని చిత్రీకరణ   పూర్తయింది. ఈ విషయాన్ని చిత్ర బృందం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ‘‘మా సంస్థలో ప్రతిష్ఠాత్మకంగా    నిర్మిస్తున్న చిత్రమిది. కథ పరంగా, సాంకేతికంగా అత్యున్నతంగా ఉంటుంది. ఇందులో రామ్‌ సత్య అనే ఐపీఎస్‌ అధికారిగా కనిపిస్తారు. వారం రోజులుగా ఆయనపై పరిచయ గీతాన్ని తెరకెక్కించాం. దీనికి శేఖర్‌ మాస్టర్‌ నృత్యరీతులు సమకూర్చారు. ప్రస్తుతం నిర్మాణాంతర, రీరికార్డింగ్‌ పనుల్ని ప్రారంభించాం. త్వరలో మిగిలిన పాటల్ని విడుదల చేస్తాం’’ అన్నారు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, కూర్పు: నవీన్‌ నూలి, మాటలు: సాయి  మాధవ్‌ బుర్రా, ఛాయాగ్రహణం: సుజీత్‌ వాసుదేవ్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని