సత్తి నవ్విస్తాడు

హృదయాల్ని హత్తుకునే భావోద్వేగాలతోపాటు... డార్క్‌ కామెడీని మేళవించి రూపొందిన మా చిత్రం తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు జగదీష్‌ ప్రతాప్‌ భండారి.

Published : 25 May 2023 00:35 IST

హృదయాల్ని హత్తుకునే భావోద్వేగాలతోపాటు... డార్క్‌ కామెడీని మేళవించి రూపొందిన మా చిత్రం తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు జగదీష్‌ ప్రతాప్‌ భండారి. ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్‌కి స్నేహితుడిగా నటించి ప్రేక్షకుల్ని మెప్పించిన నటుడీయన. ఇటీవల ‘సత్తిగాని రెండెకరాలు - ఛాప్టర్‌ 1’ అనే సినిమాలో ప్రధాన పాత్రధారిగా నటించారు. అభినవ్‌ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించింది. వెన్నెల కిషోర్‌, అనీషా దామా, బిత్తిరి సత్తి, మోహనశ్రీ సురాగ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ నెల 26న ఓటీటీ వేదిక ఆహాలో ప్రసారం కానున్న ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాధ్‌లో జరిగింది. అనుదీప్‌, సత్యదేవ్‌, హను రాఘవపూడి, అనీష్‌ కురువిల్లా, వెంకీ కుడుముల, సుహాస్‌ తదితర సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉందని, చిత్రం విజయంవంతం కావాలని ఆకాంక్షించారు. కథ, కథనాలు ప్రేక్షకుల్ని కట్టిపడేసేలా ఉంటాయని, సినిమాలోని సత్తి నవ్విస్తాడని చిత్రవర్గాలు తెలిపాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు