Prabhudeva: ప్రభుదేవా షూటింగ్‌ షురూ

‘ముక్కాల ముక్కాబులా..’ ఇప్పటికీ సినీప్రేమికుల్ని అలరిస్తున్న గీతమిది. ఇందులో ప్రభుదేవా డ్యాన్స్‌, ఏఆర్‌. రెహమాన్‌ సంగీతం అభిమానులను ఉర్రూతలూగించాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఏఆర్‌ఆర్‌పీడీ6(వర్కింగ్‌ టైటిల్‌)’ అనే సినిమా రూపొందుతున్నట్లు ఇటీవలే ప్రకటించింది చిత్రబృందం.

Updated : 03 May 2024 09:57 IST

‘ముక్కాల ముక్కాబులా..’ ఇప్పటికీ సినీప్రేమికుల్ని అలరిస్తున్న గీతమిది. ఇందులో ప్రభుదేవా డ్యాన్స్‌, ఏఆర్‌. రెహమాన్‌ సంగీతం అభిమానులను ఉర్రూతలూగించాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఏఆర్‌ఆర్‌పీడీ6(వర్కింగ్‌ టైటిల్‌)’ అనే సినిమా రూపొందుతున్నట్లు ఇటీవలే ప్రకటించింది చిత్రబృందం. ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని మనోజ్‌ ఎన్‌ఎస్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైనట్లు తెలుపుతూ.. సామాజిక మాధ్యమాల వేదికగా కొన్ని ఫొటోల్ని పంచుకున్నారు ప్రభుదేవా. ఇందులో యోగిబాబు, అర్జున్‌ అశోకన్‌, అజువర్గీస్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం, డ్యాన్స్‌, కామెడీ అంశాలతో రూపొందుతున్న చిత్రమిది. దివ్య మనోజ్‌, ప్రవీన్‌ ఎలక్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని