ఇతను సల్మాన్‌ ఖాన్‌ అంటే నమ్ముతారా?

బ్రౌన్‌ రంగు జట్టు గెడ్డం, తలకి స్కార్ఫ్‌, ఎర్ర కోట్‌.. ఇదంతా పాకిస్థాన్, అఫ్గనిస్థాన్‌కి చెందిన వాడో అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే.. ఎందుకంటే ఇతను బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ కాబట్టి! అసలు గుర్తుపట్టలేకుండా ఉన్న సల్మాన్‌ ఇప్పుడు రష్యాలో ఇలా తిరుగుతున్నాడు. ఇదంతా టైగర్-3 సినిమాకోసమేనట.

Published : 22 Aug 2021 23:48 IST

ముంబయి:  బ్రౌన్‌ రంగు జట్టు గెడ్డం, తలకి స్కార్ఫ్‌, ఎర్ర కోట్‌.. ఇదంతా పాకిస్థాన్, అఫ్గనిస్థాన్‌కి చెందిన వాడో అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే.. ఎందుకంటే ఇతను బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ కాబట్టి! అసలు గుర్తుపట్టలేకుండా ఉన్న సల్మాన్‌ ఇప్పుడు రష్యాలో ఇలా తిరుగుతున్నాడు. ఇదంతా టైగర్-3 సినిమాకోసమేనట. ప్రస్తుతం రష్యా వీధుల్లో ఓ చేజింగ్‌ సీన్‌ షూటింగ్‌లో.. ఓ అభిమాని ఈ దృశ్యాలను క్లిక్‌మనిపించాడు. ఈ చిత్రంలో సల్మాన్‌ఖాన్‌ పక్కనే మేనల్లుడు నిర్వాన్ ఖాన్‌ నల్ల కోటులో కనిపిస్తాడు. ఆయనే చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. యశ్‌ రాజ్‌ ఫిల్మ్‌ నిర్మిస్తున్న ఈ టైగర్‌-3.. ‘ఏక్‌ థా టైగర్‌’, ‘టైగర్‌ జిందా హై’ చిత్రాలకు సీక్వెల్‌గా రాబోతుంది. రష్యా అనంతరం టర్కీ, ఆస్ర్టియా దేశాల్లో షూటింగ్‌ జరుపుకోనుంది. గతంలో ఎన్నడూ చూడని యాక్షన్‌ సీక్వెన్స్‌లో చిత్రంలో ఉండబోనున్నాయట. భారీ అంచనాలున్న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకే నిర్మాతలు మొగ్గుచూపుతున్నారు. కాగా సల్మాన్‌ ఇందులో  ఏజెంట్‌గా కనిపించనున్నారు. కత్రినా ISI ఏజెంట్‌ జోయా పాత్రలో హీరోయిన్‌గా నటిస్తోంది. విలన్‌ పాత్రలో ఇమ్రాన్ హష్మీ కనిపించనున్నారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని