హిందీ ‘వేద’ ఆగయా!

హృతిక్‌ రోషన్‌, సైఫ్‌ అలీఖాన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘విక్రమ్‌ వేద’. తమిళంలో ఇదే పేరుతో తెరకెక్కిన చిత్రానికి దర్శకత్వం వహించిన పుష్కర్‌, గాయత్రి హిందీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం

Published : 11 Jan 2022 02:05 IST

హృతిక్‌ రోషన్‌, సైఫ్‌ అలీఖాన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘విక్రమ్‌ వేద’. తమిళంలో ఇదే పేరుతో తెరకెక్కిన చిత్రానికి దర్శకత్వం వహించిన పుష్కర్‌, గాయత్రి హిందీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం హృతిక్‌ రోషన్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమాలోని హృతిక్‌ పాత్ర వేదకు సంబంధించిన లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇటీవలే లక్నోలో కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. ఓ గ్యాంగ్‌స్టర్‌, పోలీస్‌ అధికారి మధ్య జరిగే కథతో తెరకెక్కిన యాక్షన్‌, క్రైమ్‌, థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ ఏడాది సెప్టెంబరు 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని