రెండు చిత్రాలు.. రెండు విరామాలు... ఒక్కడే హీరో

ఎంత గొప్ప సినిమా అయినా ఏకధాటిగా కూర్చొని ప్రేక్షకులు చూడలేరు. ఇంటర్వెల్‌ తప్పనిసరి. సినిమా నిడివిని బట్టి విరామం ఇస్తుంటారు. కానీ భారతీయ సినిమా చరిత్రలో ఓ రెండు సినిమాలకు మాత్రం ఎక్కువ నిడివి కారణంగా రెండు సార్లు ఇంటర్వెల్‌ ఇచ్చారు.

Updated : 27 Sep 2022 06:33 IST

ఎంత గొప్ప సినిమా అయినా ఏకధాటిగా కూర్చొని ప్రేక్షకులు చూడలేరు. ఇంటర్వెల్‌ తప్పనిసరి. సినిమా నిడివిని బట్టి విరామం ఇస్తుంటారు. కానీ భారతీయ సినిమా చరిత్రలో ఓ రెండు సినిమాలకు మాత్రం ఎక్కువ నిడివి కారణంగా రెండు సార్లు ఇంటర్వెల్‌ ఇచ్చారు. మరో విశేషం ఏంటంటే ఈ రెండు చిత్రాల్లోనూ కథానాయకుడు రాజ్‌కపూర్‌. రెండింటికీ దర్శకుడు కూడా ఆయనే. అవే ‘సంగం’, ‘మేరా నామ్‌ జోకర్‌’ చిత్రాలు. ‘సంగం’ సినిమా 3 గంటల 58నిమిషాలు, ‘మేరా నామ్‌ జోకర్‌’ 4 గంటల 15 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ సినిమాతోనే రాజ్‌కపూర్‌ తనయుడు ప్రముఖ నటుడు రిషికపూర్‌ తెరకు పరిచయం అయ్యారు. సాధారణంగా రాజ్‌కపూర్‌ సినిమాల్లో పాటలన్నీ లతా మంగేష్కర్‌ ఆలపించేవారు. కానీ ఈ సినిమాలో ఆమె సోదరి ఆశా భోంస్లే పాడారు. రాజ్‌కపూర్‌ నిర్ణయం ఎలాంటిదైనా ఈ చిత్రంలోని ‘జీనా యహా మర్నా యహా’ పాట నేటికీ వినిపిస్తూనే ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని