
Vikram Veda: విక్రమ్ వేద.. హృతిక్ లుక్ వచ్చేసింది.!
ముంబయి: మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన కోలీవుడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘విక్రమ్ వేద’. పోలీస్‌కు గ్యాంగ్‌స్టర్‌కు మధ్య జరిగే ధర్మయుద్ధంలో ఎవరు విజయం సాధించారనే ఆసక్తికర అంశంతో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో సూపర్‌హిట్ అందుకుంది. దీంతో ఈ సినిమాని హిందీ ప్రేక్షకులకు చేరువ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతోన్న విషయం తెలిసిందే. సైఫ్ అలీఖాన్, హృతిక్ రోషన్ మల్టీస్టారర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. పుష్కర్ అండ్ గాయత్రి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ వేగంగా జరుగుతోంది. సోమవారం హృతిక్ పుట్టినరోజు సందర్భంగా ‘విక్రమ్ వేద’ నుంచి ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ని చిత్రబృందం నెట్టింట్లో షేర్ చేసింది. ఇందులో హృతిక్ ఓ ఫైటర్‌లా పవర్‌ఫుల్‌గా కనిపించారు. ఇందులో ఆయన ‘వేద’ అనే గ్యాంగ్ స్టర్‌గా కనిపించనున్నారు. ఒరిజినల్‌లో విజయ్ సేతుపతి పోషించిన పాత్రలో ఇప్పుడు హృతిక్ నటిస్తున్నారు.
ఇవీ చదవండి
Advertisement