Mili: చలిలో ‘మిలీ’

శ్రీదేవి, బోనీ కపూర్‌ల ముద్దుల తనయ జాన్వీ కపూర్‌ రొటీన్‌ కథానాయిక పాత్రలకు భిన్నంగా వెళుతోంది. ఆమె నటించిన చిత్రం ‘మిలీ’. తాజాగా ఈ సినిమాలో జాన్వీకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తో పాటు టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

Updated : 13 Oct 2022 09:39 IST

శ్రీదేవి, బోనీ కపూర్‌ల ముద్దుల తనయ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) రొటీన్‌ కథానాయిక పాత్రలకు భిన్నంగా వెళుతోంది. ఆమె నటించిన చిత్రం ‘మిలీ’ (Mili). తాజాగా ఈ సినిమాలో జాన్వీకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తో పాటు టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. మైనస్‌ 16 డిగ్రీల గడ్డకట్టుకుపోయే చలిలో ఇరుక్కుపోయిన జాన్వీ నోటిని ఉపయోగించి టేపులను చింపివేసే సన్నివేశంతో టీజర్‌ మొదలైంది. ఆమె ఫ్రీజర్‌ నుంచి బయటకు రావడానికి ప్రయత్నించడం, ఆమెను బంధిచినట్లు కనిపించడం ఆసక్తిని రేకిత్తిస్తున్నాయి. బోనీ కపూర్‌ నిర్మిస్తున్న ఈసినిమాకి ముత్తుకుట్టి జేవియర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబరు 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని