Kangana Ranaut: అందుకే నా సినిమా నచ్చలేదేమో!

హిందీ చిత్రసీమకు ఓ విధంగా గడ్డు కాలమే నడుస్తోంది. వరసగా పరాజయాలే పలకరిస్తున్నాయి. అదే సమయంలో దక్షిణాదిలో మంచి విజయాలు దక్కుతున్నాయి.

Updated : 05 Nov 2022 08:31 IST

హిందీ చిత్రసీమకు ఓ విధంగా గడ్డు కాలమే నడుస్తోంది. వరసగా పరాజయాలే పలకరిస్తున్నాయి. అదే సమయంలో దక్షిణాదిలో మంచి విజయాలు దక్కుతున్నాయి. బాలీవుడ్‌ ఈ పరిస్థితికి కారణం ఏంటి? అంటే కంగనా (Kangana Ranaut) ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఆమె నటించిన ‘ధాకడ్‌’ (Dhaakad) కూడా ఘోరంగా ఫ్లాప్‌ అయ్యింది. ‘‘దక్షిణాది చిత్రాలు భారీగా విజయాలు అందుకుంటున్నాయంటే కారణం వాటి కథ. భారతీయ మూలాలను ప్రతిబింబించే అలాంటి కథలతో ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అవుతున్నారు. పాశ్చాత్య సంస్కృతితో సాగే వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. అందుకే బాక్సాఫీసు వద్ద నిరాశే ఎదురవుతుంది. ఈ ఏడాది నా నుంచి వచ్చిన ఓ చిత్రం కూడా ఇలాంటి కారణంతోనే ప్రేక్షకులకు నచ్చలేదేమో’’అని చెప్పింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు