Rohit Sharma: యువ రోహిత్‌ను చూశారా.. బర్త్‌డే గిఫ్ట్‌గా టీనేజ్ ఫొటో షేర్‌ చేసిన తల్లి పుర్ణిమ

భారత క్రికెట్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని కెప్టెన్‌గా ఎదిగిన రోహిత్ శర్మ (Rohit Sharma) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా హిట్‌మ్యాన్‌కు ప్రముఖులు, ఫ్యాన్స్‌ శుభాకాంక్షలు చెబుతున్నారు.

Updated : 30 Apr 2024 14:48 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ నేడు 37వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా హిట్‌మ్యాన్‌కు అభిమానులు, క్రికెటర్లు, సెలబ్రెటీల నుంచి బర్త్‌ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో ‘‘హ్యాపీ బర్త్‌ డే రోహిత్ శర్మ’’ అనే హ్యష్‌ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. భారత మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్‌, యువరాజ్‌ సింగ్, వసీమ్ జాఫర్, బీసీసీఐ కార్యదర్శి జై షా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక దిల్లీ క్యాపిటల్స్‌, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ ప్రత్యేక చిత్రాలను పోస్టు చేసి విషెస్‌ చెప్పాయి. ముంబయి ఇండియన్స్‌ ‘సలామ్ రోహిత్ భాయ్‌’ అంటూ ఓ పాటను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ఇది నెటిజన్లను ఆకర్షిస్తోంది. హిట్‌మ్యాన్‌ టీనేజ్‌లో ఉన్నప్పుడు అతడితో కలిసి దిగిన ఫొటోను రోహిత్ శర్మ తల్లి పూర్ణిమ శర్మ ఇన్‌స్టాలో పోస్టు చేశారు. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. 

‘‘భారత క్రికెట్‌లోని అజేయ శక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. రోహిత్‌ నీ నాయకత్వ పటిమ, నైపుణ్యాలు, ఓటమిని అంగీకరించని వ్యక్తిత్వం మన జట్టు గుండెచప్పుడు. హిట్‌మ్యాన్.. మరో ఏడాది బౌండరీలు బాదతూ చరిత్ర సృష్టించాలి’’ అని జై షా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో  పోస్టు చేశాడు.

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ 17 సీజన్‌లో రోహిత్ శర్మ రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడి 160.31 స్ట్రెక్‌రేట్‌తో 311 పరుగులు చేశాడు. చెన్నైపై శతకం బాదాడు. నేడు లఖ్‌నవూ, ముంబయి జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి రోహిత్‌కు బర్త్‌ డే గిప్ట్ ఇవ్వాలని ముంబయి ఆటగాళ్లు భావిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని