Parineeti Chopra: చూసిన 5 నిమిషాలకే పెళ్లి చేసుకోవాలనిపించింది

బాలీవుడ్‌ హీరోయిన్‌ పరిణితీ చోప్రా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన లవ్‌ స్టోరీ గురించి చెప్పారు.

Published : 30 Apr 2024 15:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాఘవ్‌ చద్దాను కలిసిన 5 నిమిషాలకే పెళ్లి చేసుకోవాలనిపించిందని హీరోయిన్ పరిణితీ చోప్రా (Parineeti Chopra) తెలిపారు. ఈ ఏడాది ‘అమర్‌సింగ్‌ చంకీల’తో విజయాన్ని అందుకున్న ఆమె వరుస ఇంటర్వ్యూలతో బిజీ అయ్యారు. ఇందులోభాగంగా ఓ యూట్యూబ్‌ ఛానల్లో మాట్లాడుతూ.. తన లవ్‌స్టోరీ చెప్పారు.

‘మొదటిసారి రాఘవ్‌ను లండన్‌లో ఓ పార్టీలో చూశాను. ఒకరినొకరం పలకరించుకొని వెళ్లిపోయాం. ఆ మరుసటి రోజు స్నేహితులందరం కలిసి బ్రేక్‌ఫాస్ట్‌కు వెళ్లాం. అక్కడికి రాఘవ్ కూడా వచ్చారు. అప్పటివరకు అతను ఎవరో కూడా తెలియదు. రాఘవ్‌తో మాట్లాడిన 5 నిమిషాలకే.. అతడిని పెళ్లి చేసుకుంటానేమోనని మనసుకు అనిపించింది. అప్పటికి తన గురించి నాకేం తెలియదు.. వయసెంత? పెళ్లైందా.. పిల్లలున్నారా? అసలేం చేస్తుంటారు.. ఇలాంటివేం తెలియదు. నా ముందు రాఘవ్‌ ఉన్నారు. మేమిద్దరం కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నామంతే. కానీ, నా మనసుకు మాత్రం అతడే నాకు కాబోయే భర్త అని అనిపించింది. ఆ తర్వాత రాఘవ్‌ గురించి నా స్నేహితులను అడిగి తెలుసుకున్నా’ అని చెప్పారు.

రాఘవ్‌ చద్దా (Raghav Chadha)- పరిణితీ చోప్రా గతేడాది సెప్టెంబరు 24న ఒక్కటయ్యారు. రాజస్థాన్‌ రాష్ట్రం ఉదయ్‌పుర్‌లోని లీలాప్యాలెస్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇటీవల పరిణీతి తల్లి కానున్నారంటూ వార్తలు రాగా వాటిని ఆమె ఖండించారు. ‘ఫ్యాషన్‌ కోసం వదులుగా ఉండే దుస్తులు వేసుకున్నా.. పెద్ద సైజ్‌ డ్రెస్‌ ధరించినా.. సౌకర్యవంతంగా ఉండే ఇండియన్ కుర్తా వేసుకున్నా ప్రెగ్నెన్సీ అనే భావిస్తారా’ అని పోస్ట్‌ పెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని