IPL 2024 playoffs: ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లకు ఇంగ్లాండ్ స్టార్‌ ఆటగాళ్లు దూరం.. కారణమిదే

పొట్టి ప్రపంచకప్‌లో ఆడే ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఐపీఎల్-17 సీజన్‌ ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండరు. ఈమేరకు ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనను విడుదల చేసింది.

Published : 30 Apr 2024 18:19 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌ 2024 కోసం ఇంగ్లాండ్ తమ జట్టును ప్రకటించింది. పొట్టి ప్రపంచకప్‌లో ఆడే ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఐపీఎల్ 17 సీజన్‌ ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండరు. ఈమేరకు ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. టీ20 ప్రపంచకప్ కంటే ముందు పాకిస్థాన్‌తో ఇంగ్లాండ్ నాలుగు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ మే 22-30 మధ్య జరగనుంది. దీంతో ఆ సిరీస్‌లో ఆడేందుకు ప్రపంచకప్‌నకు ఎంపికైన ఆటగాళ్లు ఇంగ్లాండ్ ఆటగాళ్లు స్వదేశానికి పయనమవుతారు. జూన్ 2 నుంచి యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది.

ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు దూరమయ్యే ఆటగాళ్లు:

జోస్ బట్లర్ (రాజస్థాన్), మొయిన్ అలీ (చెన్నై), జానీ బెయిర్‌స్టో (పంజాబ్), సామ్ కరన్‌ (పంజాబ్‌), లియామ్ లివింగ్‌స్టోన్ (పంజాబ్‌), ఫిల్ సాల్ట్ (కోల్‌కతా), విల్ జాక్స్ (బెంగళూరు) రీస్ టాప్లీ (బెంగళూరు).

టీ20 ప్రపంచకప్‌నకు ఇంగ్లాండ్  జట్టు:

జోస్ బట్లర్ (కెప్టెన్‌), మొయిన్ అలీ, జోఫ్రా అర్చర్, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, అదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టాప్లీ, మార్క్ వుడ్.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని