Kangana Ranaut: లైంగిక వేధింపులకు గురయ్యా: కంగనా రనౌత్
‘లాక్ అప్’ అనే రియాల్టీ షో కోసం కంగన మొదటిసారి యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా జరిగిన ఎపిసోడ్లో మునావర్ అనే కంటిస్టెంట్.. చిన్నతనంలోనే తాను బంధువుల నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని...
ముంబయ: చిన్నతనంలోనే తాను కూడా లైంగిక వేధింపులకు గురయ్యానంటూ నటి కంగనా రనౌత్ వెల్లడించారు. నటిగానే కాకుండా వ్యాఖ్యాతగానూ కంగన ప్రేక్షకుల్ని అలరిస్తోన్న సంగతి తెలిసిందే. ‘లాక్ అప్’ అనే రియాల్టీ షో కోసం ఆమె మొదటిసారి యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా జరిగిన ఎపిసోడ్లో మునావర్ అనే కంటెస్టెంట్.. చిన్నతనంలోనే తాను బంధువుల నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని, కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిస్తే ఏమవుతుందోననే భయంతో ఇప్పటి వరకూ ఎవ్వరికీ చెప్పలేదని, బంధువుల వల్ల నాలుగేళ్లు నరకం చూశానని చెప్పి భావోద్వేగానికి గురయ్యాడు. ఇలాంటి చేదు సంఘటనను ఎలాంటి బెరుకు లేకుండా పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌పై ధైర్యంగా పంచుకోవడంతో మునావర్‌పై కంగన ప్రశంసల వర్షం కురిపించారు. అనంతరం తాను ఎదుర్కొన్న ఇబ్బందులను ఆమె పంచుకున్నారు.
‘‘సమాజంలో చాలామంది చిన్నారులు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. పిల్లల పెంపకం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నేను కూడా నా చిన్నప్పుడు లైంగిక వేధింపులకు గురయ్యాను. నాకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు.. మా గ్రామంలో నివసించే ఓ అబ్బాయి మాతో ఇబ్బందికరంగా ప్రవర్తించేవాడు. ఆ అబ్బాయి మా కంటే నాలుగేళ్లు మాత్రమే పెద్దవాడు. మా స్నేహితులందరం కలిసి ఆటలాడుకునే సమయంలో అతను మా వద్దకు వచ్చి.. మమ్మల్ని అసభ్యకరంగా తాకేవాడు. లైంగిక వేధింపులకు గురవుతున్నామని ఆ వయసులో మాకు తెలియలేదు’’ అని కంగన చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారిన ట్రెండ్.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!
-
రోజా కామెంట్స్‌పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
-
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న