Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 05 May 2024 16:59 IST

1. రాబోయేది ఎన్డీయేనే.. మళ్లీ ప్రధాని మోదీనే: ధర్మవరం సభలో చంద్రబాబు

‘దేశంలో రాబోయేది ఎన్డీయేనే.. మళ్లీ ప్రధాని అయ్యేది మోదీనే’ అని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. రాష్ట్రంలో ధర్మాన్ని గెలిపించేందుకు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో కూటమి అభ్యర్థి సత్యకుమార్‌కు మద్దతుగా నిర్వహించిన సభలో కేంద్రమంత్రి అమిత్‌షాతో కలిసి ఆయన పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. పోస్టల్‌ బ్యాలెట్ల పోలింగ్‌ ప్రక్రియలో తీవ్ర గందరగోళం

పోస్టల్‌ బ్యాలెట్ల పోలింగ్‌ ప్రక్రియలో ఏర్పడిన గందరగోళం, అయోమయ పరిస్థితులు పోలింగ్‌ అధికారులను కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మే 13న పోలింగ్‌ విధుల్లో పాల్గొనాల్సిన అధికారులు.. తమకే ఓటు లేకుండా చేయడంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇంత గందరగోళ పరిస్థితులు తామెన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి 

3. వాళ్లది రాజ్యాంగాన్ని మార్చే సమూహం: రాహుల్‌

భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. నిర్మల్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ‘‘పేదల హక్కులను హరించి.. ధనికులకు ప్రయోజనం చేకూర్చడమే భాజపా లక్ష్యం. రైతులకు రుణమాఫీ చేస్తామంటే మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు’’ అని రాహుల్‌ అన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి 

4. ప్రాణాలు కాపాడిన యాపిల్‌ వాచ్‌.. సీఈఓ రియాక్షన్‌ ఇదే..

యాపిల్‌ వాచ్‌ (Apple watch) ఓ మహిళ జీవితాన్ని కాపాడింది. అందులోని పల్స్‌ రేట్‌ ఫీచర్‌ ఆధారంగా అలర్ట్‌ అయిన ఆమె సరైన సమయంలో ఆసుపత్రికి వెళ్లి ప్రాణాలు దక్కించుకుంది. దీనికి సంబంధించిన వివరాలను ఓ ఆంగ్ల మీడియాతో పంచుకున్నారు. దీనిపై యాపిల్‌ సీఈఓ కూడా స్పందించడం విశేషం. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. మా మామ నీచుడు.. అతనికి ఓటేస్తే సమాజానికి చేటు: డాక్టర్‌ గౌతమ్‌

ఏపీ మంత్రి, సత్తెనపల్లి వైకాపా అభ్యర్థి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు ఓటు వేస్తే పవిత్రమైన ఎమ్మెల్యే పదవి అపవిత్రమవుతుందని ఆయన రెండో అల్లుడు గౌతమ్‌ అన్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుడిగా పని చేస్తున్న గౌతమ్‌.. అంబటి అరాచకాలను వివరిస్తూ విడుదల చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి 

6. USA: ‘భారతీయుల వల్లే అమెరికా టెక్‌ ఇండస్ట్రీ మనుగడ’

నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా భావించే అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో జరిగే అత్యధిక ఇన్నోవేషన్లకు భారతీయులే నాయకులని ‘సిలికాన్‌ వ్యాలీ సెంట్రల్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌’ సీఈఓ హర్బీర్‌ కె భాటియా తెలిపారు. ఇండియన్స్‌ లేకుండా అగ్రరాజ్య టెక్‌ పరిశ్రమ మనుగడ సాగించలేదని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!

మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ వందల మంది మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వేధింపులకు గురైన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. ఏపీలో చంద్రబాబు.. కేంద్రంలో మోదీ వస్తే రెండేళ్లలో పోలవరం పూర్తి: అమిత్‌షా

ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరీని అంతం చేసేందుకే తెదేపా(TDP), జనసేన (Janasena)తో కలిసి కూటమిగా ఏర్పడ్డామని భాజపా(BJP) అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్‌షా (Amit Shah) అన్నారు. అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించుతామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో భాజపా అభ్యర్థి సత్యకుమార్‌కు మద్దతుగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌

ప్రస్తుతం పాఠశాలలో చిన్నారులపై ఉపాధ్యాయులు చేయి చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. కానీ, కొన్నేళ్ల క్రితం విద్యనభ్యసించిన వారికి మాత్రం ఇది సాధారణం. ఈ తరహా శిక్ష భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ (CJI Justice Chandrachud) కూడా ఎదురైందట. తాను కూడా చిన్నప్పుడు పాఠశాలలో బెత్తం దెబ్బలు తిన్నారట. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి 

10. మారిన ట్రెండ్‌.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!

వచ్చే వారం రోజుల్లో ప్రైమరీ మార్కెట్‌లో మళ్లీ సందడి నెలకొననుంది. మొత్తం మూడు కంపెనీలు ఐపీఓకి (IPO) రానున్నాయి. బ్లాక్‌స్టోన్‌ మద్దతున్న ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఆరోగ్య సంరక్షణ కంపెనీ ఇండెజీన్‌, ట్రావెల్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ టీబీఓ టెక్‌ పబ్లిక్‌ ఇష్యూకు వస్తున్నాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని