బైక్‌ పార్కింగ్‌ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న

బైక్‌ పార్కింగ్‌ విషయంలో తలెత్తిన వివాదం నిండు ప్రాణాన్ని బలితీసుకున్న ఘటన కోటాలో చోటుచేసుకుంది.

Updated : 05 May 2024 15:48 IST

కోటా: రాజస్థాన్‌లోని కోటాలో ఘోరం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనం పార్కింగ్‌ విషయంలో సోదరుల మధ్య చెలరేగిన గొడవ తమ్ముడి ప్రాణాన్ని బలితీసుకుంది. కోటాలోని సుకేత్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జిరి గ్రామంలో ఇంటి బయట ద్విచక్రవాహనం పార్కింగ్‌ చేయడంపై సన్వార భీల్‌ (38), అతడి తమ్ముడు మనోజ్‌ భీల్‌ (30) మధ్య శుక్రవారం అర్ధరాత్రి వివాదం తలెత్తింది. వారిద్దరి మధ్య మాటామాటా పెరగడంతో సన్వారా భీల్‌ తమ్ముడిపై గొడ్డలితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. మనోజ్‌ను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని