Keerthy Suresh: విప్లవం ఇంటి నుంచే మొదలవుతుంది!
‘కేజీఎఫ్’, ‘కాంతార’ వంటి విజయంతమైన చిత్రాలతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్.
‘కేజీఎఫ్’, ‘కాంతార’ వంటి విజయంతమైన చిత్రాలతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ (Hombale Films). ఇప్పటికే తెలుగులో ‘సలార్’ వంటి భారీ ప్రాజెక్ట్ నిర్మిస్తున్న ఈ సంస్థ.. ఇప్పుడు తమిళ చిత్రసీమ వైపు దృష్టి సారించింది. కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రధాన పాత్రలో ‘రఘు తాత’ (Raghu Thatha) అనే సినిమాని నిర్మిస్తోంది. ఇది హోంబలే ఫిల్మ్స్‌కు తొలి తమిళ సినిమా. దీన్ని సుమన్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఆదివారం ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్ర ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. ‘‘విప్లవం ఇంటి నుంచి మొదలవుతుంది’’ అంటూ ఆ పోస్టర్‌కు ఓ వ్యాఖ్యను జోడించారు. ‘‘ఇదొక భిన్నమైన కామెడీ డ్రామా చిత్రం. దృఢ సంకల్పం కలిగిన ఓ మహిళ చేసే స్ఫూర్తిదాయక పోరాట గాథగా కనిపిస్తుంది’’ అని నిర్మాణ సంస్థ తెలిపింది. ఈ సినిమాని తమిళం పాటు తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కీర్తి ప్రస్తుతం తెలుగులో చిరంజీవితో ‘భోళా శంకర్’, నానితో ‘దసరా’ చిత్రాల్లో నటిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
విరాట్ - హార్దిక్‌కు నో ఛాన్స్.. ఈ లఖ్‌నవూ స్టార్‌కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
బైక్‌పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!