KGF Chapter 2: రాఖీభాయ్ ఏం చేయబోతున్నాడు?
ప్రస్తుతం భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తికగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ‘కేజీయఫ్2’(KGF Chapter 2) ఒకటి.
ఇంటర్నెట్‌డెస్క్: ప్రస్తుతం భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తికగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ‘కేజీయఫ్2’(KGF Chapter 2) ఒకటి. యశ్(Yash) కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీయఫ్: చాప్టర్-1’కు కొనసాగింపుగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. మరోవైపు తమిళ నటుడు విజయ్ ‘బీస్ట్’, షాహిద్ కపూర్ ‘జెర్సీ’ చిత్రాలు కూడా ఏప్రిల్ 14నే విడుదల చేస్తామని ఆయా చిత్ర బృందాలు తెలిపాయి. ఈ క్రమంలో బాక్సాఫీస్ వద్ద త్రిముఖ పోరు తప్పదని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలో ఓ వార్త యశ్ అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. ‘కేజీయఫ్2’ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తాజాగా కన్నడనాట టాక్ వినిపిస్తోంది.
ఇంతకీ ఏం జరిగిందటే.. ‘కేజీయఫ్2’లో యశ్ ఇంట్రో సాంగ్ అనుకున్న స్థాయిలో రాలేదని దర్శకుడు ప్రశాంత్‌నీల్ భావిస్తున్నారట. దీంతో ఆ సాంగ్‌ను మళ్లీ షూట్ చేద్దామనుకుంటున్నారట. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌లో 5 రోజుల పాటు షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో నిర్మాణానంతర కార్యక్రమాలు ఆలస్యమవుతాయని అంటున్నారు. అభిమానులు మాత్రం అనుకున్న తేదీకే సినిమా వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది. మరోవైపు ఈ చిత్రం ప్రతినాయకుడు అధీర పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కనిపించనున్నారు. ఇటీవలే ఆయన తన డబ్బింగ్‌ను కూడా పూర్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్‌పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య
-
Team India: పాక్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
-
ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు సీఈఓలు.. సుందర్ పిచాయ్ గ్రాడ్యుయేషన్ ఫొటో వైరల్
-
చేతులూ కాళ్లూ కట్టేసి సిగరెట్లతో భర్తకు వాతలు.. వీడియోతో పోలీస్‌స్టేషన్‌కు బాధితుడు!
-
అభ్యంతరకర వీడియోలున్న.. 25వేల పెన్‌డ్రైవ్‌లను పంచారు: కుమారస్వామి
-
రష్యా అధినేతగా ఐదోసారి.. ఘనంగా పుతిన్ ప్రమాణస్వీకారం