Prabhas: ప్రభాస్ కోసం మరో అందం
ఓవైపు ‘సలార్’.. మరోవైపు ‘ప్రాజెక్ట్ కె’ చిత్రాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు కథానాయకుడు ప్రభాస్.
ఓవైపు ‘సలార్’.. మరోవైపు ‘ప్రాజెక్ట్ కె’ చిత్రాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు కథానాయకుడు ప్రభాస్ (Prabhas). తాజాగా ఈ జాబితాలోకి మారుతి చిత్రం కూడా వచ్చి చేరిన సంగతి తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులో ప్రభాస్‌కు జోడీగా ముగ్గురు కథానాయికలు సందడి చేయనున్నారు. ఇప్పటికే వీటిలో రెండు పాత్రల కోసం నిధి అగర్వాల్, మాళవికా మోహనన్ పేర్లను ఖరారు చేశారు. కాగా, ఇప్పుడు మూడో నాయికగా రిద్ది కుమార్‌ను (Riddhi Kumar) ఎంపిక చేశారని సమాచారం. ‘లవర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రిద్ది. ప్రభాస్ గత చిత్రం ‘రాధేశ్యామ్’లో ఓ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఆయనకు జోడీగా కనిపించే అవకాశం దక్కించుకుంది. ఇప్పటికే ఓ చిన్న షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. త్వరలో మరో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించుకోనుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Pathaan: రోజుకు రూ. వంద కోట్లు.. ‘పఠాన్’ ఖాతాలో మరో రికార్డు
-
Sports News
IPL 2023: ఐపీఎల్ ఆల్‌టైమ్ ‘XI’.. కెప్టెన్సీపై చర్చ.. ఓజా ఎంపిక ఎవరంటే?
-
Politics News
Krishna: వైకాపాలో భగ్గుమన్న విభేదాలు.. చెప్పులతో కొట్టుకున్న ఎంపీ, ఎమ్మెల్యే వర్గీయులు
-
Politics News
Nara lokesh: సమస్యలు తెలుసుకుంటూ.. బీసీలకు భరోసానిస్తూ: రెండో రోజు లోకేశ్ పాదయాత్ర
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Social Look: అనుపమ స్పెషల్ పోస్ట్.. కశ్మీర్లో సిమ్రత్‌కౌర్