Nandamuri Bala krishna: సింహం వేట

బాలకృష్ణ సినిమాలో పోరాటం అంటే సింహం వేటకి దిగినట్టే ఉంటుంది. మహాశివరాత్రి సందర్భంగా విడుదలైన తన 109వ సినిమా ప్రచార చిత్రంలోనూ అదే విషయాన్ని చాటి చెప్పారు బాలకృష్ణ. బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది.

Updated : 09 Mar 2024 10:24 IST

బాలకృష్ణ సినిమాలో పోరాటం అంటే సింహం వేటకి దిగినట్టే ఉంటుంది. మహాశివరాత్రి సందర్భంగా విడుదలైన తన 109వ సినిమా ప్రచార చిత్రంలోనూ అదే విషయాన్ని చాటి చెప్పారు బాలకృష్ణ. బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంస్థతో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. శుక్రవారం విడుదల చేసిన ప్రచార చిత్రంలో బాలకృష్ణ చేసిన శక్తిమంతమైన పోరాట ఘట్టంతో చేసిన హంగామా సినిమాపై మరిన్ని అంచనాల్ని పెంచింది. ‘ఏంట్రా...వార్‌ డిక్లేర్‌ చేస్తున్నావా?’ అని ప్రశ్నించగా, ‘సింహం నక్కలమీదకు వస్తే వార్‌ అవ్వదు... ఇట్స్‌ కాల్డ్‌ హంటింగ్‌’ అంటూ బాలకృష్ణ ప్రతినాయకుల్ని వేటాడే సన్నివేశాలు అందులో కనిపిస్తాయి. బాలీవుడ్‌ నటుడు బాబీ దేవోల్‌ ఇందులో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: విజయ్‌ కార్తీక్‌, కూర్పు: నిరంజన్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌: అవినాష్‌ కొల్లా.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని