కృష్ణ జయంతికి ‘హరోం హర’

‘హరోం హర’తో సినీప్రియుల్ని పలకరించనున్నారు సుధీర్‌ బాబు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని జ్ఞానసాగర్‌ ద్వారక తెరకెక్కించారు. సుమంత్‌ జి.నాయుడు నిర్మాత.

Published : 28 Apr 2024 00:30 IST

రోం హర’తో సినీప్రియుల్ని పలకరించనున్నారు సుధీర్‌ బాబు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని జ్ఞానసాగర్‌ ద్వారక తెరకెక్కించారు. సుమంత్‌ జి.నాయుడు నిర్మాత. మాళవిక శర్మ కథానాయిక. సునీల్‌ ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమాని ప్రముఖ నటుడు కృష్ణ జయంతి సందర్భంగా మే 31న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం శనివారం ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. అందులో సుధీర్‌ వేలాయుధం పట్టుకొని నిలబడి ఉండగా.. తన వెనకున్న జనం గౌరవంతో చేతులెత్తి నమస్కరించడం కనిపించింది. 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇందులో సుధీర్‌ కుప్పం యాసలో సంభాషణలు చెప్పనున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు ముగింపు దశలో ఉన్నాయి. ఈ సినిమాకి చైతన్‌ భరద్వాజ్‌ సంగీతమందిస్తుండగా.. అరవింద్‌ విశ్వనాథన్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని